అందుబాటులో ఉంటు ప్రజా సేవచేస్తా

అందుబాటులో ఉంటు ప్రజా సేవచేస్తా
17వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి పడమటింటి సతీష్
చెన్నూర్ ఆంధ్రప్రభ : వార్డు ప్రజాలకు అందుబాటులో ఉంటు ప్రజాసేవ చేస్తానని 17వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి పడమటింటి సతీష్ అన్నారు. ఎన్నికల ప్రచార ముగింపులో భాగంగా 17వార్డులో వార్డు ప్రజలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి గడప గడపకు తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపివ్వాలని ఓటర్లను వేడుకున్నారు.వార్డు ప్రజల తో మమేకమై వార్డులోఅందుబాటులో ఉంటు అభివృద్ధికి, ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాలనిలో తాగు నీరు, విద్యుత్ లైట్లు, సైడ్ డ్రైనేజి వ్యవస్థను సక్రమంగా అందెందుకు ప్రత్యేక శ్రద్ద తీసుకుంటానని కారు గుర్తుకు ఓటువేసి ఆశీర్వదించాలని కోరారు.
