17 TIPS | జలుబు చేసినప్పుడు..

17 TIPS | జలుబు చేసినప్పుడు..

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్ డెస్క్ : శీతాకాలంలో చాలామందిని జలుబు సమస్య వెంటాడుతుంది. వాతావరణంలో (Weather) మార్పు, అత్య‌ల్ప ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌వుతుండ‌టంతో జలుబు బాధితులు ఎక్కువగా ఉంటున్నారు. జలుబు తోపాటు తుమ్ములు, దగ్గు, గొంతు నొప్పి, అలసట త‌దిత‌ర లక్షణాలు అధికంగా ఇబ్బంది పెడుతుంటాయి. జలుబు ఎక్కువగా ఉంటే.. తలనొప్పి, ఒళ్లు నొప్పు, కొద్దిపాటి జ్వరంగా కూడా ఉంటుంది. ఈ లక్షణాల నుంచి ఉపశమం పొందడానికి కొన్ని టిప్స్ పాటిస్తే స‌రిపోతుంది.

17 TIPS
  • జలుబు చేసినప్పుడు.. సరిపడా నీళ్లు తాగడం చాలా ముఖ్యం.
  • జలుబు చేసినప్పుడు హెర్బల్‌ టీలు, నిమ్మరసం నీళ్లు, వేడి నీళ్లు, గోరువెచ్చని పాలు తాగాలి.
  • ఇలా చేస్తే శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది.
  • కాఫీ, టీ వంటి కెఫిన్‌ డ్రింక్స్‌కు దూరంగా ఉండాలి. వీటిని తాగితే శరీరాన్ని డీహైడ్రేడ్‌ చేస్తుంది.
  • జలుబు చేసినప్పుడు ఆవిరి పడితే.. ముక్కమార్గాలు క్లీన్‌ అవుతాయి.
  • మరగ కాచిన నీటిలో కొన్ని తులసి ఆకులు వేసుకొని పీల్చ‌డంతో ఉపశమనం కలిగిస్తుంది.
  • తులసిలోని యాంటీ ఆక్సిడెంట్లతోపాటు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు జలుబును త్వరగా తగ్గిస్తాయి.
  • గొంతు నొప్పి ఉంటే నీళ్లలో ఉప్పు వేసి పుక్కిలిస్తే కొంత ఉపశమనం లభిస్తుంది.
  • రోజుకు నాలుగైదు సార్లు ఇలా చేస్తే గొంతు క్లియర్‌ అవుతుంది.
  • జలుబు నుంచి కొంత ఉపశమనం పొందడానికి శరీరానికి విశ్రాంతి చాలా ముఖ్యం.
  • శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ ఉత్తమంగా పనిచేయడానికి తగినంత నిద్ర, విశ్రాంతి అవసరం.
  • శరీరాన్ని వేడిగా ఉంచుకోవడానికి మందంగా ఉండే దుస్తులు ధరించండి.
  • శరీరాన్ని వెచ్చగా ఉంచడం వల్ల కండరాల నొప్పులు తగ్గుతాయి, త్వరగా రికవరీ అవుతారు.
  • వీటితో పాటు వేయించిన ఆహార పదార్థాలు, బయటి ఆహారం, కొవ్వు పదార్థాలను బాగా తగ్గించాలి.
  • వీలైనంతవరకు ఇంట్లో వండిన, తేలికగా ఉండే ఆహారానికే ప్రాధాన్యమివ్వాలి.
17 TIPS

17 TIPS | మ‌రికొన్ని చిట్కాలు మీ కోసం..

  • కొద్దిగా పసుపు, నల్లమిరియాలు, తేనె కలిపిన మిశ్రమం తీసుకోవాలి.
  • ఈ రోజుకు కనీసం 2-3 సార్లు తులసి నీరు తాగితే మంచిది.
  • ఉసిరి, పైనాపిల్, నిమ్మ, కివీ మొదలైన పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలి.
  • 7-8 తులసి ఆకులు, ఒక చిన్న అల్లం ముక్క, కొన్ని వెల్లుల్లి ముక్కలు, ఒక టీస్పూన్ చొప్పున వాము, మెంతులు, పసుపు, 4-5 నల్ల మిరియాలు నీటిలో వేసి మరిగించాలి. ఉదయాన్నే నిద్ర లేవగానే ఈ మిశ్రమాన్ని తాగాలి.

CLICK HERE TO READ క‌రివేపాకా.. మ‌జాకా..

CLICK HERE TO READ MORE

Leave a Reply