16 years | గ్రామాభివృద్ధికి సేవకుడిలా పని చేస్తా
–అన్ని వర్గాలకు అండగా నిలుస్తా
–కత్తెర గుర్తు సర్పంచ్ అభ్యర్థి దుమ్మని సత్తన్న
16 years | లక్షేట్టిపేట, ఆంధ్ర ప్రభ : గ్రామాభివృద్ధికి తాను సేవకుడిలా పని చేస్తానని పాత కొమ్ముగూడెం సర్పంచ్ అభ్యర్థి దుమ్మని సత్తన్న అన్నారు. గత 16 ఏళ్ల(16 years) రాజకీయ జీవితంలో ఎన్నోసార్లు ప్రజలకు అండగా నిలిచానన్నారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆశీస్సులతో కత్తెర గుర్తు అధిక మెజారిటీతో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఇప్పటికే ఎమ్మెల్యే అండతో గ్రామానికి పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలు వచ్చేలా కృషి చేసినట్లు పేర్కొన్నారు. 24 ఇందిరమ్మ ఇండ్లు, 30 సీఎం రిలీఫ్ ఫండ్, 20 కల్యాణ లక్ష్మీ చెక్కులు, ఐ మాక్స్ లైట్స్, రూ. 20 లక్షలతో డ్రైనేజీ, సీసీ రోడ్స్(CC Rhodes) వచ్చేలా కృషి చేసినట్లు వివరించారు.
అంతేకాకుండా ఎస్సీ కాలనీలో బోర్ వెల్, పాఠశాలకు రూ. 80 వేలు, మాడెలమ్మ దేవాలయం కు రూ. 65 వేలు, పోచమ్మ దేవాలయంకు రూ. 45 వేల ఆర్ధిక సహకారం, రూ. కోటి తో ఎస్సీ కాలనీ నుంచి పాత కొమ్ముగూడెం బ్రిడ్జి, చెరువు సుందరీకరణ పనులు ఎమ్మెల్యే అండతో నడుస్తున్నాయని పేర్కొన్నారు.
తాను సర్పంచ్ గా గెలిచిన వెంటనే గ్రామంలో డ్రైనేజీ, ఎస్సీ కాలనీలో నీటి ట్యాంక్, అంగన్వాడీ భవన్(Anganwadi Bhavan), చిన్న మత్తడి నిర్మాణం, గ్రామ పంచాయతీలో మరుగుదొడ్లు, స్కూల్ రిపేర్ పనులు, ఇందిరమ్మ ఇండ్లు, నీటి సమస్య తీర్చడం, మాడెలమ్మ దేవాలయం వద్ద బోర్ వెల్, ఎస్సీ కాలనీ లో బోర్ వెల్, స్మశాన వాటిక(Cemetery) దగ్గర ఐ మాక్స్ లైట్ ఏర్పాటు అయ్యేలా చర్యలు చేపడుతానని హామీలు ఇచ్చారు. ప్రజలందరూ ఈ సర్పంచ్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో తనను గెలిపించాలని, గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని విజ్ఞప్తి చేశారు.

