16 Wanderers | సంచార కుటుంబాలతో కలెక్టర్….

16 Wanderers | సంచార కుటుంబాలతో కలెక్టర్….

  • అడిగి తెలుసుకున్న జీవన స్థితిగతులు

16 Wanderers | బాపట్ల, ఆంధ్రప్రభ : నియోజకవర్గంలోని పిట్టల వానిపాలెం మండలం రెడ్డిపాలెం రోడ్డు సమీపంలో నివసిస్తున్న 16 సంచార కుటుంబాలను కలెక్టర్ వినోద్ కుమార్ శుక్రవారం సాయంత్రం ఆకస్మికంగా సందర్శించారు. కొయ్యలతో (చెక్కలతో) మంచాలు, కుర్చీలు, పిల్లల ఆట వస్తువులు, వంటింటి సామాగ్రి తయారు చేస్తున్న వైనాన్ని ఆయన అడిగి తెలుసుకున్నారు.

వారు తయారు చేసిన వస్తువుల నాణ్యతను స్వయంగా పరిశీలించారు.స్థానిక సంతలు, గ్రామ ఉత్సవాల్లో ఈ వస్తువులను విక్రయిస్తున్నామని, పనిని బట్టి ఆదాయం లభిస్తోందని వారు కలెక్టర్ వివరించారు. మీ కుటుంబాల పిల్లలు బడికి వెళ్తున్నారా లేదా అని కలెక్టర్ ప్రత్యేకంగా ఆరా తీశారు. విద్యే భవిష్యత్తుకు పునాది అని, ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న మౌలిక సదుపాయాలను ఉపయోగించుకుని పిల్లలను తప్పనిసరిగా చదివించాలని వారికి అవగాహన కల్పించారు.

16 Wanderers |

ఇలాంటి సంప్రదాయ వృత్తుల మీద ఆధారపడి బతుకుతున్న కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు, తక్కువ వడ్డీతో రుణ సౌకర్యం, మార్కెటింగ్ చేయూత అందించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. తహశీల్దార్ డి.వెంకటేశ్వరరావు, ఆర్.ఐ శ్రీనివాసరావు, డిప్యూటీ ఎంపీడీఓ కె.సుజాత, ఇతర మండల అధికారులు పాల్గొన్నారు.

16 Wanderers |

click here to read more : 6 Cr.| ‘ సేవాతీర్థ్ ‘ లో తొలి నిర్ణయాలివే..

click here to read more :

Leave a Reply