1,500 tarpaulins | ఇబ్బంది పెడితే కఠిన చర్యలు

1,500 tarpaulins | ఇబ్బంది పెడితే కఠిన చర్యలు
1,500 tarpaulins | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : పసుపు రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భరోసా ఇచ్చారు. అకాల వర్షాల కారణంగా తేమకు గురైన పసుపును కూడా ఎలాంటి కోతలు లేకుండా కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు.
తేమ శాతం, కోతల పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దని మార్కెట్ అధికారులకు మంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడైనా రైతులకు ఇబ్బందులు కలిగితే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సీజన్ నేపథ్యంలో నిజామాబాద్ మార్కెట్‌కు పసుపు పెద్ద ఎత్తున వస్తోందని ఆయన తెలిపారు. అకాల వర్షాల సమయంలో రైతులు తమ సరుకును రక్షించుకునేందుకు 1,500 టార్పాలిన్ల పంపిణీకి బిడ్డింగ్ పూర్తి చేసినట్లు వెల్లడించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి, మంచి నాణ్యత కలిగిన పసుపుకు ప్రభుత్వం నిర్ణయించిన ధర తప్పకుండా చెల్లించాలని సూచించారు.
