15 years | అందరికీ ఆదర్శం కుమ్ర భీమ్రావు

15 years | అందరికీ ఆదర్శం కుమ్ర భీమ్రావు
- నాడు వీటీడీఏ అధ్యక్షునిగా నేడు సర్పంచ్ గా సేవలు
15 years | జైనూర్, ఆంధ్రప్రభ : ఈనాటి కాలంలో ఎక్కువ శాతం ప్రజాప్రతినిధులు వ్యక్తిగత స్వార్థాలు చూసుకోవడం సేవలు చేయడం సహజం కానీ నిస్వార్ధంగా 10 సంవత్సరాలుగా తమ పంచాయతీ సమస్యలను జిల్లా రాష్ట్ర స్థాయి అధికారుల దృష్టికి తీసుకు వెళ్లడంతో పాటు ఎంపీ మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి నేరుగా సమస్యలకు వినతిపత్రాలు ఇవ్వడం ఆయన లక్ష్యం. ఎవరికి కలవడానికి కూడా జింకడు ముందుకు వెళుతూ సమస్యలను చెప్పడం ఆయన నైజం.
గత 15 ఏళ్లుగా(15 years) వీటీడీఏ అధ్యక్షునిగా నాయకునిగా సేవలందిస్తూ తనకు సర్పంచ్ గా ఇతర పదవులకు పోటీ చేసే అర్హత లేక 1994యాక్ట్ తో సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ఏ పదవికి పోటీ చేయలేదు. గత పది సంవత్సరాలుగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు) మండలంలోని మారుమూల గ్రామపంచాయతీ అయినా బాండేర్ పంచాయతీ కి చెందిన అప్పటి వీటిడిఏ అధ్యక్షుడు, ఇప్పటి బాండేర్ నూతన సర్పంచ్ కుమ్ర భీమ్రావు(Kumra Bheemrao) పంచాయతీ సమస్యల పరిష్కారం చేయడంతో పాటు అభివృద్ధి పనుల మంజూరు చేయడానికి అందరికీ ఆదర్శంగా ప్రెస్ చేస్తూ పంచాయతీ ప్రజల పొందుతున్నారు.

గతంలో వీటీడీఏ ప్రెసిడెంట్ గా ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం 1994 యాక్ట్(1994 Act) తొలగించడంతో భీమ్రావు ఎన్నికల్లో నిలబడి సర్పంచిగా గెలిచాడు. అభివృద్ధికి రెండు దఫాలుగా తన కొడుకు కోడలు సర్పంచిగా గెలిపించి సేవలందించి ఈసారి జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బాండేరు సర్పంచిగా పిలిచి పంచాయతీ అభివృద్ధి ప్రజల సమస్యల పరిష్కారం పై దృష్టి సారించారు. సర్పంచ్ గా గెలిచిన తర్వాత ఇటీవల హైదరాబాద్ కు వెళ్లి ప్రజా సచివాలయంలో రాష్ట్ర స్థాయి అధికారులకు కలిసి పలు సమస్యలపై వినతి పత్రాలు సమర్పించారు.
మండల జిల్లా అధికారులు పట్టించుకోకపోతే రాష్ట్రస్థాయి అధికారులకు మంత్రులకు ఎంపీ ఎమ్మెల్యేలకు కలిసి సమస్య పరిష్కారమయ్యే వరకు పట్టు వీడని విక్రమార్కులాగా ఆయన పట్టుదలతో ఎన్నో సమస్యలు ఎన్నో అభివృద్ధి పనులు చేయించి అందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.
సమస్యలు పరిష్కరించడమే నా ధ్యేయం
- బాండేర్ సర్పంచ్ కుమ్ర భీమ్రావు
తనకు ప్రజాసేవ చేయాలని ఎంతో కృషి ఉందని తన పంచాయతీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే తపన ఉందని గత పది సంవత్సరాల నుండి పంచాయతీ అభివృద్ధి ప్రజల సమస్యల పరిష్కారానికి వీటీడీఏ అధ్యక్షునిగా కృషి చేశానని తనకు గతంలో 1994 యాక్ట్ ప్రకారం ఎన్నికల బరిలో నిలబడే అవకాశం లేక పట్టుదలతో వీటిని అధ్యక్షునిగా కృషి చేశానని ఇంకా ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ప్రజల ఆశీస్సులను పొందడమే లక్ష్యంగా పనిచేస్తానని ఆయన ఆంధ్రప్రభ తో తెలిపారు.

