అభివృద్ధి చేస్తా అవకాశం ఇవ్వండి

14వ వార్డు కాంగ్రెస్ అభ్యర్ధి వాకిటి మానస హన్మంతు

ఆంధ్రప్రభ, మక్తల్ : మున్సిపల్ ఎన్నికల్లో 14వ వార్డు అభివృద్ధి కోసం తనకు ఆదరించి ఆశీర్వదించి గెలిపించండి అభివృద్ధి చేస్తానని కాంగ్రెస్ అభ్యర్థి వాకిటి మానస హన్మంతు అన్నారు. బుధవారం వార్డు పరిధిలో విస్తృతంగా మద్దతుదారులతో కలిసి ఇంటింటి ప్రచారం చేపట్టారు .ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి సహకారంతోనే మున్సిపాలిటీలు అభివృద్ధి సాధ్యమని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేసి చూపిస్తామని అన్నారు.గత పాలకుల నిర్లక్ష్యంతో మక్తల్ మున్సిపాలిటీ అభివృద్ధి చెందలేదని అన్నారు. మంత్రి వాకిటి శ్రీహరి మద్దతుతో మక్తల్ మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో నడిపించడం కాంగ్రెస్ పార్టీకె సాధ్యమని అన్నారు. 14వ వార్డులో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు .మిషన్ భగీరథ పైప్లైన్ పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయడమే తన ధ్యేయమని అన్నారు.

అదేవిధంగా వార్డులో నెలకొన్న వివిధ సమస్యలు ,పారిశుద్వానికి ప్రాధాన్యం ఇస్తానని చెప్పారు. ఒకసారి గెలిపించి అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ నెల 11న జరగనున్న ఎన్నికల్లో పేదల నేస్తం హస్తం గుర్తుకు ఓటు వేసి 14వ వార్డు కౌన్సిలర్ గా తనను గెలిపించాలని వాకిటి మానస హన్మంతు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వాకిటి శ్యామ్ ,బి .రమేష్ ,వాకిటి కిష్టప్ప, రాజు ,యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు భాస్కర్,నాగరాజ్ ,ఏఎంసి డైరెక్టర్ అంజి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply