14th Day | ట‌న్నెల్ ఆప‌రేష‌న్‌లో కేరళ డాగ్స్

అమ్రాబాద్, ఆంధ్రప్రభ : ఎస్ఎల్ బీసీ సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది ఆచూకీ గుర్తించేందుకు కేర‌ళ నుంచి క్యాడ‌వ‌ర్ డాగ్స్‌ల‌ను రప్పిస్తున్నట్లు డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ తెలిపారు. గురువారం ఉదయం టన్నెల్ వద్ద జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ తో కలిసి ఐఐటీ నిపుణులు, సింగరేణి సాంకేతిక నిపుణులు, సైనిక అధికారులు, ఎన్‌డీఆర్ఎఫ్‌ అధికారులతో సమీక్ష నిర్వహించి దిశా నిర్దేశం చేశారు.
ఉదయం ఎన్‌డీఆర్ఎఫ్‌, సింగరేణి, ఐఐటీ నిపుణులతోపాటు సైనిక అధికారులు టన్నెల్ లోపలికి వెళ్లారు. చివర నుంచి మట్టిని తీసి ఎక్సలెటర్ పై వేస్తూ నీటిని మరో వైపు దారి మళ్ళీస్తూ ముందుకు సాగాలని సూచించారు. సింగరేణి సిబ్బంది తోపాటు యాంత్రిక సహకారం తీసుకుంటూ సిబ్బంది బురదను బయటికి తరలించేందుకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

డాగ్స్ సిద్ధం
నిమిది మంది ఆచూకీని ఈ డాగ్స్ ద్వారా గుర్తించే అవ‌కాశాలు ఉన్నాయి. ఉద‌యం రెస్క్యూ సిబ్బంది లోప‌ల‌కు వెళ్లి టీబీఎం మిష‌న్ విడిభాగాల‌ను బ‌య‌ట‌కు తీసుకు వ‌చ్చారు.

ఇప్ప‌టికే చేరుకున్న రోబోటిక్‌, సిస్మాల‌జీ బృందాలు
సొరంగంలో చిక్కుకుపోయిన క్షతగాత్రులను రక్షించేందుకు చేపడుతున్న సహాయక చర్యలలో భాగంగా బుధవారం రోబోటిక్ ప్రతినిధుల బృందం, సిస్మాల‌జీ బృందాలు చేరుకున్నాయి. బుధ‌వారం సాయంత్రం వాటర్ జట్ ల ద్వారా నీటి తొల‌గింపు ట్ర‌య‌ల్ ర‌న్ చేశారు. గురువారం ఉద‌యం సొరంగంలోకి రోబోటిక్‌, సిస్మాల‌జీ బృందాలు చేరుకున్నాయి. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ కల్నల్ పరీక్షిత్ మెహర టన్నెల్ బోరింగ్ మెషిన్ నమూనా తో అధికారులకు టన్నెల్ లోపల కొనసాగుతున్న సహాయక చర్యలను వివరించారు. టన్నెల్ బోరింగ్ మిషన్ చివరి భాగంలో శిథిలాలను తొలగించడం జరిగిందని, రెస్క్యూ ఆపరేషన్ నిర్వ‌హించేతీరుపై వివ‌రించారు. టన్నెల్ బోరింగ్ మిషన్ ఎడమవైపు నుండి వాటర్ జెట్ ల ద్వారా బురదను తొలగించే పనులు చేప‌ట్ట‌నున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *