14 Lives | యజమాని అరెస్ట్

14 Lives | యజమాని అరెస్ట్

డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం

14 Lives | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం తెలుగు రాష్ట్రాలను కలచివేసింది. 14 మంది ప్రాణాలు కోల్పోయిన ఈ విషాద ఘటనపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ప్రాథమిక విచారణలో ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని తేలడంతో, బస్సు డ్రైవర్ యువరాజుతో పాటు యజమాని హరికృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రైవర్‌ను ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ సెక్షన్ 304ఏ కింద కేసు నమోదు చేశారు.

ప్రస్తుతం నిందితులను పోలీసులు విచారిస్తున్నారు. విచారణ అనంతరం వారిని కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. కోర్టు వీరికి రిమాండ్ విధించే అవకాశం ఉందని సమాచారం. టిప్పర్ లారీని ఢీకొన్న ఈ ప్రమాదంలో 13 మంది సజీవ దహనం కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో బాలుడు మరణించడంతో మృతుల సంఖ్య 14కు చేరింది.

Leave a Reply