ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా
ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : ఉరవకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆదినారాయణ ఆధ్వర్యంలో జేకేసీ, ప్లేస్‌మెంట్ సెల్ సమన్వయంతో జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాలో ప్రముఖ సంస్థ అయిన మెడ్ప్లస్ కంపెనీ పాల్గొని, అభ్యర్థులను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆదినారాయణ ప్రారంభిస్తూ, విద్యార్థులు ఈ జాబ్ మేళా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపు నిచ్చారు.
జాబ్ మేళా 130 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అందులో 48 మంది విద్యార్థులు ఎంపిక చేశారు. ఉద్యోగ అవకాశాలను పొందారు. మెడ్ప్లస్ సంస్థకు చెందిన హెచ్‌ఆర్ మేనేజర్లు సందీప్, సలీమ్ బెంగళూరు నుండి విచ్చేసి అభ్యర్థుల ఇంటర్వ్యూలను నిర్వహించారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి తగిన విధంగా ఎంపిక ప్రక్రియను పూర్తి చేశారు. విద్యార్థులకు విలువైన మార్గదర్శకత్వం, ఉద్యోగ అవకాశాలపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో ప్లేస్‌మెంట్ అధికారి డాక్టర్ అయ్యన్న, జేకేసీ ఫుల్ మెంటర్ నాగేంద్ర గౌడ్, ఐక్యూఏసీ సమన్వయకర్త రాజేష్, జేకేసీ కోఆర్డినేటర్ నారాయణ స్వామి, డాక్టర్ వెంకటరాముడు, వెంకటేశులు సుధాకర్, డాక్టర్ రమేష్ బాబు, పరమేష్, ఇతర బోధక సిబ్బంది పాల్గొన్నారు. ఈ జాబ్ మేళా ద్వారా విద్యార్థులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభించడం పట్ల కళాశాల యాజమాన్యం ఆనందం వ్యక్తం చేసింది.
