12వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థిముమ్మరంగా ఇంటింటి ప్రచారం

మక్తల్ , ఫిబ్రవరి 5 (ఆంధ్రప్రభ) మక్తల్ మున్సిపల్ ఎన్నికల్లో మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బిఆర్ఎస్ అభ్యర్థిఎండి.మొయిజ్ హుస్సేన్ ముమ్మరంగా ఇంటింటి ప్రచారం చేపట్టారు.గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా 12వ వార్డులో ఇంటింటికి వెళ్లి ఓటర్ల మద్దతు కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 12వ వార్డు అభివృద్ధికి పూర్తిస్థాయి బాధ్యత తీసుకుంటా అభివృద్ధి కోసం తనను ఆదరించి ఆశీర్వదించి 12వ వార్డు కౌన్సిలర్ గా గెలిపించాలని బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎండి.మొయిజ్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు. గతంలో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అండతో ఎంతో అభివృద్ధి జరిగిందని మరింత అభివృద్ధి కోసం తనను ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. ఈ వార్డును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని అన్నారు. అన్ని ప్రాంతాల్లో సీసీ రోడ్లు డ్రైనేజీల నిర్మాణం చేపడతామన్నారు .తనను గెలిపిస్తే 12వ వార్డు పరిధిలోని అన్ని గల్లీలో సీసీ రోడ్డు డ్రైనేజీలు ఏర్పాటు చేస్తానని అన్నారు .అధికార పార్టీతో అభివృద్ధి జరగదని వారి మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. ఈ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను ఆదరించి ఆశీర్వదించి కారు గుర్తుకు ఓటు వేసి కౌన్సిలర్గా గెలిపించవలసిందిగా ఎండి.మొయిజ్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు.ఈ.కార్యక్రమంలో అన్వర్ హుస్సేన్, వన్నెకారి రాజు ,సిద్దిఖ్ ,రహమత్, నిజాం, మీరజ్ ,సోహెల్ ,అదనాన్ ,ఆసిఫ్ ,సిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply