12th ward | ప్రజాసేవే లక్ష్యంగా పని చేస్తాను: కూరపాటి కవిత యాదగిరి

12th ward | ప్రజాసేవే లక్ష్యంగా పని చేస్తాను: కూరపాటి కవిత యాదగిరి
12th ward | స్టేషన్ ఘన్‌పూర్ 12వ వార్డు నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ
ప్రజల ఆశీర్వాదంతో అభివృద్ధే లక్ష్యంగా ముందుకు
నిరుపేద మహిళలకు 200 కుట్టు మిషన్లు హామీ
డ్రైనేజీ, సీసీ రోడ్లు, వీధి దీపాలపై ప్రత్యేక దృష్టి
ఇచ్చిన హామీలను గెలిచిన వెంటనే అమలు చేస్తానని భరోసా
12th ward | ఆంధ్రప్రభ, స్టేషన్ ఘన్‌పూర్, : స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీలోని 12వ వార్డు నుంచి బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా కూరపాటి కవిత యాదగిరి పోటీ చేస్తున్నారు. పద్మశాలి ముద్దు బిడ్డగా రాజకీయ రంగంలోకి మొదటి సారిగా ప్రజా సేవ చేయా లనే అడుగుపెట్టారు..సేవే లక్ష్యంగా అభివృద్ధే ఆయుధంగా ముందుకు సాగుతున్న ఆమె, ఇంటింటా తిరుగుతూ ప్రజల ఆశీర్వాదం కోరుతు న్నారు. బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా పనిచేస్తానని చెబుతూ మాటలకే పరిమితం కాకుండా పనితోనే తన సామర్థ్యాన్ని నిరూపిస్తానని భరోసా ఇస్తున్నారు. మంచి సేవా గుణం కలవారిగా ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే నాయకురాలిగా ఇప్పటికే వార్డులో మంచి పేరు సంపాదించుకున్నారని స్థానికులు చెబుతున్నారు. ప్రజలతో ఉన్న అనుబంధం, సేవా మనస్తత్వం ఆమె గెలుపుకు బలంగా మారనున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

-ఇచ్చిన ప్రతి హామీని తూచ తప్పకుండా అమలు చేస్తానని భరోసా:
వార్డులో మంగళవారం స్థానిక నాయకులతో కలిసి అభ్యర్థి ఇంటింటా తిరుగుతూ ఓటర్లను కలుస్తూ విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తనను గెలిపిస్తే వార్డు అభివృద్ధిని చేసి చూపిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. అనంతరం అభ్యర్థి కూరపాటి కవిత యాద గిరి మాట్లాడుతూ…ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి సహకారంతో వార్డులోని నిరుపేద మహిళలకు 200 కుట్టు మిషన్లు అందిస్తాను. గెలిచిన వెంటనే వాటిని ఇప్పించే పూర్తి బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. అలాగే కల్యాణి లక్ష్మి, సీఎం ఆర్‌ఎఫ్ వంటి సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ సహాయం అందేలా చూస్తానని తెలి పారు. వార్డులో ప్రధానంగా ఉన్న డ్రైనేజీ సమస్యల పరిష్కారం, సీసీ రోడ్ల నిర్మాణం, వీధి దీపాల నిర్వహణ వంటి మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారిస్తానని చెప్పారు. అభివృద్ధే లక్ష్యంగా, ప్రజల సమస్యలే ప్రాధాన్యంగా పనిచేస్తానని వెల్లడించారు. పద్మశాలి ముద్దు బిడ్డగా మొదటిసారి సేవ చేసే అవకాశం ఇవ్వాలని ప్రజలను అభ్యర్థించారు. ఇచ్చిన ప్రతి హామీని తూచ తప్పకుండా అమలు చేస్తానని భరోసా ఇచ్చారు.
click here to read 12th ward | ప్రజాసేవే లక్ష్యంగా పని చేస్తాను: కూరపాటి కవిత యాదగిరి
