రాము సాహితీకి బ్రహ్మరథం..

12th ward | సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : సంగారెడ్డి పట్టణం 12వ వార్డులో బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి రాము సాహితీకి వార్డు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు గోదావరి అంజిరెడ్డి ఆధ్వర్యంలో గడప గడపకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో పాల్గొన్న గోదావరి అంజిరెడ్డి మాట్లాడుతూ.. 12వ వార్డులో గత కొన్ని సంవత్సరాలుగా అభివృద్ధి కుంటుపడిందని అన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ప్రభుత్వాలు గతంలో వార్డులో గణనీయమైన అభివృద్ధి పనులు చేపట్టలేదని విమర్శించారు.
ప్రస్తుతం వార్డులో జరుగుతున్న చాలా పనులు కేంద్ర ప్రభుత్వ నిధులతోనే కొనసాగుతున్నాయని తెలిపారు. రాము సాహితీని కౌన్సిలర్‌గా గెలిపిస్తే.. కేంద్ర ప్రభుత్వం సహకారంతో పాటు ఎంపీ, ఎమ్మెల్సీ నిధులను సమర్థంగా వినియోగించి 12వ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఈ గడప గడపకు ప్రచార కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
