మున్సిపల్ కౌన్సిలర్లకు సన్మానం

మున్సిపల్ కౌన్సిలర్లకు సన్మానం
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలోని రాంనగర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చౌటుప్పల్ మున్సిపాలిటీలోని 13వ వార్డు కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్ కుమార్ గౌడ్, 12వ వార్డు కౌన్సిలర్ పాక చిరంజీవి యాదవ్, 18 వ వార్డు కౌన్సిలర్ బుడ్డ సురేష్, 19వ వార్డు కౌన్సిలర్ పిల్లలమర్రి మధుసూదన్ లను శాలువాలు, పూలమాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్ లు బత్తుల వాణి విప్లవ్, పిల్లలమర్రి మధుసూదన్, బుడ్డ సురేష్, పాక చిరంజీవి లు మాట్లాడుతూ ప్రజలు మాపై ఎంతో నమ్మకంతో మమ్ము భారీ మెజార్టీతో గెలిపించినందుకు ముందుగా వార్డుల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా వార్డుల అభివృద్ధికి, ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని కౌన్సిలర్లు తెలిపారు. ఈ సన్మాన కార్యక్రమంలో వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు, సభ్యులు, అధిక సంఖ్యలో వార్డుల ప్రజలు పాల్గొన్నారు.
