కరెంట్ షాక్‌తో 12ఏండ్ల బాలుడు మృతి…

ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని పెద్దపొర్ల గ్రామంలో ఆదివారం సాయంత్రం ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురై 12 ఏళ్ల బాలుడు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

పెద్దపొర్ల గ్రామానికి చెందిన కుర్వ లింగమ్మ, అంజప్ప దంపతుల పెద్ద కుమారుడు కార్తీక్ (12) మక్తల్ పట్టణంలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. ఆదివారం సెలవు కావడంతో, తన తల్లిదండ్రులకు సహాయం చేయడానికి గ్రామ సమీపంలోని ఒక ఫ్లాట్‌కు వెళ్లాడు. అక్కడ నిల్వ ఉంచిన పత్తిని బొలెరో వాహనంలోకి నింపుతుండగా, కార్తీక్ వాహనం పైకి ఎక్కి పత్తిని తొక్కుతున్నాడు. ఆ సమయంలో వాహనంపై నుంచి వెళ్తున్న విద్యుత్ తీగలు అనుకోకుండా బాలుడికి తగిలాయి.

తీవ్ర విద్యుత్ ఘాతానికి గురైన కార్తీక్ అక్కడికక్కడే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ, ఫలితం లేకపోయింది. బాలుడు మార్గమధ్యలోనే ప్రాణాలు విడిచాడు. కళ్లముందే కొడుకు విగతజీవిగా మారడంతో తల్లిదండ్రుల రోదనలు పలువురిని కలిచి వేశాయి.

Leave a Reply