కాంగ్రెస్ అభ్యర్థుల ను గెలిపించాలి..

కాంగ్రెస్ అభ్యర్థుల ను గెలిపించాలి..

కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం
12,13 వ వార్డు లలో మంత్రి అడ్లూరి ప్రచారం

ధర్మపురి, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఓటర్ల ను కోరారు. ఆదివారం 12,13 వార్డుల లో కాంగ్రెస్ అభ్యర్థులు చుక్క సంధ్య భీంరాజ్,చిపిరిశెట్టి రాజేష్ లకు మద్దతు గా ప్రచారం చేశారు. వాడ వాడ ల తిరుగుతూ వార్డుల సమస్యలను ఓటర్ల సమస్యలు తెలుసుకొని వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇస్తున్న మంత్రి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ధర్మపురి పట్టణంలో వాడ వాడల తిరుగూ అభివృద్దిని వివరిస్తున్నారు. 10ఏళ్ల బీఆర్ఎస్ వైపల్యాలను ఎండగడుతూ రెండేళ్ల అభివృద్దిని ఓటర్లకు వివరిస్తు మంత్రి ముందుకు సాగారు.

ఈసందర్బంగా మంత్రి మాట్లాడుతూ ధర్మపురి మున్సిపాలిటి పరిధిలోని 15వార్డులకు గాను 15వార్డుల్లో విజయం సాధిస్తామని మంత్రి తెలిపారు. ధర్మపురిలో బీజేపీ పార్టీ ఖాతా తెరవదని బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయడానికి సైతం ప్రజలు సిద్దంగా లేరని మంత్రి అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో గడిచిన రెండు సంవత్సరాలుగా ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాలను అందజేస్తున్నామని మంత్రి ఓటర్లకు వివరించారు. రానున్న రోజుల్లో అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందజేస్తామని పేర్కొన్నారు. మున్సిపాల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులను భారీ మోజార్టీతో గెలిపించాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ ఓటర్లను కోరారు.

Leave a Reply