ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి….

ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి….
నివాళులర్పించిన డిసిసి ఉపాధ్యక్షుడు…
ఘట్ కేసర్, ఆంధ్రప్రభ : మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలను, ఆదివారం మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ సర్కిల్ పరిధిలోని లింగాపురం గ్రామంలో నవ చైతన్య యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ (డిసిసి) ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై, జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మహేష్ గౌడ్ మాట్లాడుతూ.. అణగారిన వర్గాల సమానత్వం కోసం, దేశ ఆహార భద్రత (హరిత విప్లవం) కోసం జగ్జీవన్ రామ్ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. రాజ్యాంగ పరిషత్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా సామాజిక న్యాయం కోసం ఆయన నిరంతరం కృషి చేశారని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నానావత్ రూప్ సింగ్ నాయక్, కంచర్ల వెంకట్ రెడ్డి, గుర్జకుంట నర్సింహా, బాషాగల్ల విజయ్ గౌడ్, జిల్లా బీసీ సెల్ కార్యదర్శి దేరంగుల బాలరాజ్, మేడ్చల్ నియోజకవర్గం ఎస్టి సెల్ అధ్యక్షులు నానావత్ సురేష్ నాయక్, బి బ్లాక్ మహిళ కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు బర్ల అనిత, నాగులపల్లి శ్రీనివాస్, జంగ శ్రీను, గడ్డం శ్రీనివాస్, బావండ్లపల్లి సదానందం, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
