ప్రజల మద్దతుతో కారు గెలుపు ఖాయం

ప్రజల మద్దతుతో కారు గెలుపు ఖాయం
10వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి జుట్ల సంగీత సాగర్
రైటప్: తనకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్న 10వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి జుట్ల సంగీత సాగర్
మక్తల్ , ఫిబ్రవరి 7 (ఆంధ్రప్రభ) మక్తల్ మున్సిపాలిటీలో 10వ వార్డులో ప్రజల మద్దతుతో కారు గెలుపు ఖాయం అయిపోయిందని బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జుట్ల సంగీత సాగర్ ధీమా వ్యక్తం చేశారు. శనివారం భారీ ఎత్తున మహిళలతో కలిసి ముమ్మరంగా ఇంటింటి ప్రచారం చేశారు. ఇంటింటికి వెళ్లి ఎన్నికల్లో తను ఆదరించి 10వ వార్డు నుండి కౌన్సిలర్గా గెలిపించాలని అభ్యర్థించారు. ప్రజాసేవ చేయడమే ధ్యేయంగా తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని అన్నారు.ఉన్నత విద్యావంతురాలిగా ఈ ప్రాంతంలో నెలకొన్న సమస్యల పట్ల తనకు పూర్తి అవగాహన ఉందన్నారు .సమస్యల పరిష్కారానికి మార్గాలు కూడా తనకు తెలుసునని చెప్పారు. ఇక్కడి సమస్యలు పరిష్కరించడమే ధ్యేయంగా పనిచేస్తానని చెప్పారు. ప్రధానంగా అంబేద్కర్ నగర్ ,మారుతి నగర్ ,సుందర్ నగర్ లో నెలకొన్న సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు .10వ వార్డు పరిధిలో పూర్తిస్థాయిలో సిసి రోడ్ల నిర్మాణం మురుగు కాలువల నిర్మాణం చేపడతామన్నారు. అధికార పార్టీన
