నవోదయ సీట్లు సాధించిన కోచింగ్ సెంటర్…

నవోదయ సీట్లు సాధించిన కోచింగ్ సెంటర్…
దర్శి, ఆంధ్రప్రభ : దర్శి లోనీ ప్రగతి కోచింగ్ సెంటర్ కి రాష్ట్రస్థాయి ర్యాంకుల్లో భాగంగా నవోదయలో మూడు ర్యాంకులు రావడం పట్ల ప్రగతి అకాడమీ డైరెక్టర్ యు. నాగరాజు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ నవోదయలో జిల్లా 10వ ర్యాంకు రావడం, పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీలలో కూడా రాష్ట్రస్థాయి ర్యాంకులు 11,355 ప్రగతి కోచింగ్ సెంటర్ కి వచ్చాయని తెలిపారు.
ర్యాంకులు సాధించిన విద్యార్థినీ విద్యార్థులను ప్రోత్సహించిన విద్యార్థుల తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకి అభినందనలు తెలిపారు. కష్టపడి చదివితే దేనినైనా సాధించవచ్చు అని ఈ విద్యార్థులు నిరూపించారని ప్రతి ఒక్కరూ కష్టపడి చదివి తమ గమ్యాన్ని చేరుకోవాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ర్యాంకులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు మరొకసారి అభినందనలు తెలిపారు. మా కోచింగ్ సెంటర్ నందు పేద విద్యార్థులకు కూడా విద్యను అందించడం జరుగుతుందన్నారు.

