దేశ గమనాన్ని మార్చిన మహోన్నత నాయకుడు…

దేశ గమనాన్ని మార్చిన మహోన్నత నాయకుడు…
జగ్జీవన్ రామ్ 108వ జయంతి వేడుకలు చిత్రపటానికి పూలమాలలు నివాళులర్పించిన నాయకులు
గుడివాడ – ఆంధ్రప్రభ : గుడివాడ రాజేందర్ నగర్ లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఉప ప్రధాని,స్వాతంత్ర్య సమరయోధుడు డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ 108వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జయంతి వేడుకల్లో భాగంగా నాయకులు,కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని కార్యాలయంలో ఏర్పాటు చేసిన బాబూ జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం, సమానత్వం కోసం జగ్జీవన్ రామ్ చేసిన పోరాటం మరువలేనిదని కొనియాడారూ.
దేశ గమనాన్ని మార్చిన మహోన్నత నాయకుడు బాబూ జగ్జీవన్ రామ్ అని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వైఎస్ఆర్సిపి నాయకులు పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వ పాలనలో దళితులపై దాడులు పెరిగాయని అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ వంటి కీలక పదవుల్లో ఉన్నవారు కూడా దళితులపై దాడులకు పాల్పడుతున్నారని అన్నారు. పేదరికం లేని సమాజం కోసం ఆయన కన్న కలలను నిజం చేసే దిశగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిందని వారు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పాలేటి చంటి,ఎం.వి నారాయణ రెడ్డి, మట్ట జాన్ విక్టర్, మెండ కిరణ్, కొంకితల ఆంజనేయ ప్రసాద్, కందుల నాగరాజు, లోయ రాజేష్, చుండూరి శేఖర్, ఆగస్త్య కృష్ణమోహన్, టీవీ రమణ కుమార్, కే నరేంద్ర, కాకోల్లు ప్రసాద్, ఎస్కే సయ్యద్, తంగిరాల మోహన్ దాస్,రేమల్లె నీలాకాంత్,ఎస్ కే బాజీ,పసలాది శేఖర్ బాబు, చింతా నాని, సిహెచ్ జోషి, చక్రి, మాదాసి వెంకటలక్ష్మి, రమేజా, మూడేళ్ల ఉమా, నిర్మల, సోనీ, సురేఖ వైయస్సార్ సిపి నాయకులు, ఎస్సీ సెల్ ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
