సిరికొండ, ఫిబ్రవరి 27 (ఆంధ్రప్రభ): సిరికొండ మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 100శాతం ఉపాధ్యాయులు ఓటింగ్ లో పాల్గొని రికార్డ్ సృష్టించారు. మండలంలో మొత్తం ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి 25మంది ఓటర్లు ఉండగా, 25 మంది ఓటింగ్ లో పాల్గొని రికార్డు నమోదు చేశారు.
అలాగే మండలంలో 715మంది పట్టభద్రుల ఓట్లు ఉన్నాయి. ఇందులో 556 ఓటింగ్ లో పాల్గొనగా, 77శాతం ఓట్లు పోలయ్యాయి. తమ పార్టీ అభ్యర్థికి 150ఓట్ల అధిక్యం లభిస్తుందని కాంగ్రెస్ నాయకులు ధీమా వ్యక్తం చేయగా, బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. తమ పార్టీ అభ్యర్థికి 400ఓట్లు లభిస్తాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.