100 percent |దివ్యాంగులకు ఉగాది కానుక ‘దివ్యాంగ శక్తి…

100 percent | దివ్యాంగులకు ఉగాది కానుక ‘దివ్యాంగ శక్తి…

  • సీట్ల కేటాయింపులో దివ్యాంగులకు తొలి ప్రాధాన్యత
  • మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్
  • స్వయంగా బస్సును నడిపిన ఎమ్మెల్యే

100 percent | ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : దివ్యాంగులకు ఉగాది కానుకగా ‘దివ్యాంగ శక్తి’ పథకం అమలుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ తెలిపారు. ఇబ్రహీంపట్నంలోని ఏపీఎస్ ఆర్టీసీ బస్సు డిపోలో ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ఎమ్మెల్యే వసంత బుధవారం ప్రారంభించారు. ఇబ్రహీంపట్నం నుంచి గొల్లపూడి వరకు దివ్యాంగులతో కలిసి బస్సు ప్రయాణం చేశారు. స్వయంగా ఆయనే డ్రైవింగ్ చేశారు. గొల్లపూడిలో దివ్యాంగులకు విందు ఏర్పాటు చేశారు. దివ్యాంగులకు స్వయంగా ఆహారాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ఏడాది డిసెంబరు 3న నిర్వహించిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం రోజున దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారన్నారు.

ఆ మాటను ఇప్పుడు నిలబెట్టుకున్నారని చెప్పారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో దాదాపు లక్ష మందికి లబ్ది కలుగుతుండగా, సీట్ల కేటాయింపులో దివ్యాంగులకు తొలి ప్రాధాన్యత ఇవ్వనున్నారని తెలిపారు. ప్రస్తుతం 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులు, 100 శాతం కంటి చూపు కోల్పోయిన వారు, 100 శాతం మూగ, చెవిటివారు, 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న మానసిక దివ్యాంగులు మాత్రమే ఏపీఎస్ఆర్టీసీ సిటీ, ఆర్డినరీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారని చెప్పారు.

100 percent |

పల్లెవెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ప్రస్తుతం వీరికి 50 శాతం రాయితీ లభిస్తోందన్నారు. 100 శాతం అంధత్వం, మానసిక వైకల్యం ఉన్న వారితో వచ్చే సహాయకులకు 50 శాతం రాయితీ లభిస్తోందని తెలిపారు.

100 percent | 40 శాతం వైకల్యం దాటిన వారికి వర్తింపు…

‘దివ్యాంగ శక్తి’ పథకం కింద దివ్యాంగులకు పూర్తిగా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించిందన్నారు. 40 శాతం లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులు అందరికీ స్త్రీశక్తి పథకం వర్తించే అన్ని బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తుందన్నారు. వారితో పాటు వచ్చే సహాయకులకు ఈ బస్సుల్లో 50 శాతం రాయితీ లభిస్తుందని తెలిపారు.

100 percent |

100 percent | ఇకపై 21 వర్గాలకు పథకం వర్తింపు…

ఇప్పటి వరకు కేవలం 4 వర్గాల దివ్యాంగులకు మాత్రమే ఉచిత ప్రయాణ సౌకర్యం ఉండేదని, ఇకపై 21 వర్గాల దివ్యాంగులకు ప్రభుత్వం ఈ సౌకర్యాన్ని కల్పిస్తుందని ఎమ్మెల్యే వసంత తెలిపారు. శారీరక, మానసిక దివ్యాంగులు, ఆటిజం, నాడీ సంబంధ వ్యాధులు, తలసేమియా, హీమోఫిలియా, సికిల్ సెల్ వంటి వ్యాధిగ్రస్తులకు ఈ పథకంతో భరోసా కలుగుతుందన్నారు.

100 percent |

100 percent | దివ్యాంగులకు క్యూఆర్ కోడ్ తో ఉచిత డిజిటల్ పాస్లు జారీ

స్త్రీ శక్తి పథకం వర్తించే బస్సుల్లో దివ్యాంగులు కూడా ఉచితంగా ప్రయాణించవచ్చన్నారు. అవసరమైన డిజిటల్ పాస్లు మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ యాప్, ఏపీఎస్ ఆర్టీసీ యాప్ ద్వారా పొందవచ్చని చెప్పారు. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ బస్టాండ్లలోని 134 కౌంటర్లలో దివ్యాంగులకు సేవలు అందుతాయన్నారు. ఈ యాప్స్ ను సదరం యాప్ తో అనుసంధానించినందున ఫిజికల్ సర్టిఫికెట్స్ చూపించాల్సిన అవసరం లేదన్నారు. క్యూఆర్ కోడ్ తో ఉచిత డిజిటల్ పాస్ లు జారీ చేస్తారని తెలిపారు. పథకం అమలుకు ప్రభుత్వం ఏటా రూ.207 కోట్లు సబ్సిడీగా అందిస్తుందన్నారు.

100 percent | దివ్యాంగులకు అండగా సీఎం చంద్రబాబు…

మేథాశక్తిలో, సృజనాత్మకతో దివ్యాంగులు అత్యంత ప్రతిభ కలిగి వుంటారన్నారు. దివ్యాంగులకు సీఎం చంద్రబాబు ఎప్పుడూ అండగా నిలుస్తున్నారన్నారు. దివ్యాంగుల పింఛన్ రూ.6 వేలకు పెంచినట్లు గుర్తు చేశారు. ఎన్ని ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన మాటకు కట్టుబడి ‘దివ్యాంగశక్తి’ పథకాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. దివ్యాంగుల తరపున సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కొండపల్లి మున్సిపల్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు, వైస్ చైర్మన్ చుట్టుకుదురు శ్రీనివాసరావు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జంపాల సీతారామయ్య, కౌన్సిలర్ లు చనమోలు నారాయణ, ధరణికోట విజయలక్ష్మి, జనసేన పార్టీ మైలవరం నియోజకవర్గ ఇన్ చార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ), కూటమి నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply