100 Injured : లిటిల్​ ఇండియా జస్ట్​ బేజార్​ ​.. Andhra Prabha Latest News

100 Injured : లిటిల్​ ఇండియా జస్ట్​ బేజార్​ ​.. Andhra Prabha Latest News

  • అర్థరాత్రి ఇరాన్​ భీకరదాడి
  • అరాద్​..డిమోనాలో క్షిపణుల వాన
  • ఇజ్రాయెల్​ పై ఇరాన్​ రివేంజ్​ అటాక్​
  • అణుకేంద్రం డిమోనా సేఫ్​
  • అరాద్​ అతలాకుతలం
  • 100 మంది పైగా ఆసుపత్రి పాలు

( ఆంధ్రప్రభ, టెహ్రాన్​ ప్రతినిధి )

100 Injured

ఇజ్రాయెల్​ లోని లిటిల్​ ఇండిర విపత్తు నుంచి తృటిలో తప్పించుకుంది. ఇజ్రాయెల్ అణు పరిశోధనా కేంద్రం నగరం డిమోనా (Dimona): పై ఇరాన్ నేరుగా క్షిపణులతో దాడి చేసింది. ఈ దాడిలో సుమారు 33 నుండి 47 మంది గాయపడ్డారు. ఐక్యరాజ్యసమితి అణు పర్యవేక్షణ సంస్థ (IAEA) ప్రకారం, అణు కేంద్రానికి ఎటువంటి నష్టం జరగలేదు . రేడియేషన్ లీకేజీలు లేవు. దక్షిణ ఇజ్రాయెల్‌లోని అరాద్ నగరంపై జరిగిన దాడిలో తీవ్ర నష్టం వాటిల్లింది. ఇక్కడ 84 మంది గాయపడగా, వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. నివాస భవనాలు ధ్వంసమవడంతో సుమారు 150 కుటుంబాలను ఖాళీ చేయించారు. భారత కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్​ పై ఇరాన్​ విరుచుకు పడింది. అందరూ నిద్రావస్థలో ఉన్న సమయంలో జనవాసాలపై క్షినణలుల వర్షం కురిసింది. అరాద్‌లో కనీసం 10 అపార్ట్‌మెంట్ భవనాలు దెబ్బతిన్నాయి, వాటిలో మూడు కూలిపోయే స్థితిలో ఉన్నాయి. ఇజ్రయోల్​ అధునాతన వాయు రక్షణ వ్యవస్థలు (Air Defense Systems) ఈ క్షిపణులను అడ్డుకోవడంలో విఫలమయ్యాయి. ఇది ఎలా జరిగిందో తెలుసుకోవడానికి ఇజ్రాయెల్ సైన్యం (IDF) విచారణ చేపట్టింది.

100 Injured : జస్ట్​ రివేంజ్​.. ఇరాన్​ ప్రకటన

100 Injured

ఇరాన్ తన క్షిపణి దాడులను “ప్రతీకార చర్య”గా పేర్కొంది. అంతకుముందు తన నతన్జ్ (Natanz) అణు కేంద్రంపై జరిగిన దాడికి సమాధానంగానే డిమోనాను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ స్టేట్ టీవీ ప్రకటించింది. ఇందుకు ప్రధాని నెతన్యాహు ప్రతిగా సమాధానం ఇచ్చారు. ఈ సాయంత్రాన్ని “చాలా కష్టమైన సమయం”గా అభివర్ణించారు. శత్రువులపై దాడులను అన్ని వైపుల నుండి ముమ్మరం చేస్తామని ఆయన హెచ్చరించార ఇజ్రాయెల్‌లోని “లిటిల్ ఇండియా”గా పేరొందిన డిమోనాలో భారత సంతతి ప్రజలు ఎక్కువగా ఉండటంతో భారత ప్రభుత్వం పరిస్థితిని గమనిస్తోంది. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ ఉద్రిక్తతల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ, చర్చల ద్వారానే పరిష్కారం సాధ్యమని పేర్కొన్నారు.

100 Injured : జరభద్రం .. భారత్​ సూచన

100 Injured

భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) ఇప్పటికే భారతీయులకు కీలక సూచనలు జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప ఇజ్రాయెల్‌కు ప్రయాణించవద్దని, అక్కడ ఉన్నవారు స్థానిక అధికారుల భద్రతా నిబంధనలను పాటించాలని కోరింది. టెల్ అవీవ్‌లోని భారత రాయబార కార్యాలయం (Embassy of India) నిరంతరం అందుబాటులో ఉంటూ, అత్యవసర సహాయం కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లను ఇమెయిల్ ఐడిలను కేటాయించింది. గతంలో పరిస్థితులు విషమించినప్పుడు చేపట్టిన భారతీయులను స్వదేశానికి తరలించిన విధంగానే ఆపరేషన్ అజయ్ (Operation Ajay) కు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది.

100 Injured : ఇజ్రాయెల్ ఎదురుదాడి:

100 Injured

ఇరాన్ క్షిపణి దాడులకు ప్రతి స్పందనగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (IDF) “గణనీయ ఎదురుదాడి” ప్రారంభించింది. ఇరాన్ లోని సైనిక స్థావరాలు క్షిపణి లాంచ్ ప్యాడ్‌లను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులు చేస్తోంది. దాడుల తీవ్రత పెరగడంతో ఇజ్రాయెల్ తన పరిసర దేశాల వాయుమార్గాలను (Airspace) తాత్కాలికంగా మూసివేసింది. ఇరాన్ ప్రయోగించిన వందలాది క్షిపణులను అడ్డుకోవడంలో ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలు (Iron Dome, Arrow) పనిచేస్తున్నప్పటికీ, కొన్ని క్షిపణులు జనావాసాలపై పడటం ఆందోళన కలిగిస్తోంది.

ALSO READ : Just 48 Hrs | ప‌వ‌ర్ ప్లాంట్స్ మ‌టాష్ Andhra Prabha Latest News

Leave a Reply