కర్రెం చెన్నమ్మ గెలుపు అభివృద్ధికి మలుపు

కర్రెం చెన్నమ్మ గెలుపు అభివృద్ధికి మలుపు
- తెలంగాణ ఉద్యమకారుడహలు నీలప్ప దత్తాత్రేయ
మక్తల్ , ఫిబ్రవరి 6 (ఆంధ్రప్రభ) మున్సిపల్ ఎన్నికల్లో 10వ వార్డు పరిధిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కర్రెం చెన్నమ్మ నీలప్ప గెలుపు అభివృద్ధికి మలుపు అని తెలంగాణ ఉద్యమకారులు జి.నీలప్ప, డి. దత్తాత్రేయ అన్నారు .ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా ముమ్మరంగా ఇంటింటి ప్రచారం చేపట్టారు .గడపగడపకు వెళ్లి అధికార పార్టీ అభ్యర్థి కర్రెం చెన్నమ్మ నీలప్పకు మద్దతుగ కోరారు. అండగా నిలిచి ఆశీర్వదించి ఓటు వేసి గెలిపించండి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామని అన్నారు.
మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి సహకారంతో పదవ వార్డులో పూర్తిస్థాయి అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుదాం అన్నారు. కౌన్సిలర్గా కర్రెం చెన్నమ్మ నీలప్ప గెలిచినప్పటికీ ఈ వార్డులోని ప్రతి ఒక్కరూ కౌన్సిలర్ గా భావించాలన్నారు .అందరి కోసం పనిచేయడమే కౌన్సిలర్ బాధ్యతగా పనిచేస్తారని చెప్పారు. వార్డు పరిధిలో సిసి రోడ్లు మురుగు కాలువల నిర్మాణం చేపట్టేందుకు ప్రాధాన్యం ఇస్తామన్నారు .అదేవిధంగా తాగునీటి సమస్య విద్యుత్ సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు.
మంత్రి వాకిటి శ్రీహరి సహకారంతో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసుకొని మున్సిపాలిటీలో ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేస్తారన్నారు. ఇతర పార్టీల వల్ల ఏమి సాధ్యం కాదని అన్నారు. అధికార పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న కర్రెం చెన్నమ్మ నీలప్పను 11న జరగనున్న ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేసి కౌన్సిలర్గా భారీ మెజారిటీతో గెలిపించాలని వారు విజ్ఞప్తి చేశారు .ఈ కార్యక్రమంలో మద్దతు దారులు తదితరులు పాల్గొన్నారు
