10 lakhs | పథకాలను సద్వినియోగం చేసుకోవాలి…

10 lakhs | పథకాలను సద్వినియోగం చేసుకోవాలి…

10 lakhs | నర్సంపేట, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి(MLA Donthi Madhav Reddy) తెలిపారు. నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోనీ మాదన్నపేట ముదిరాజ్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం నూతన భవనం ఎమ్మెల్యే దొంతి ఈ రోజు ప్రారంభించారు.

ఈ నూతన భవనాన్ని 10 లక్షల(10 lakhs) ప్రభుత్వ నిధులతో నిర్మించినట్లు తెలిపారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం మత్స్యకారుల కోసం సంఘ భవన నిర్మాణాలు, చెరువులలో చేపలను వేయడం, చేపలను అమ్ముకోవడానికి వాహనాలను సైతం సమకూరుస్తున్నట్లు వివరించారు.

ఈ కార్యక్రమంలో నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, పీసీసీ సభ్యుడు పెండెం రామానంద్, పీఎస్ సీఎస్ చైర్మన్ బొబ్బల రమణారెడ్డి, పట్టణ అధ్యక్షుడు బత్తిని రాజేందర్, మున్సిపల్ ఫోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్, ఓబీసీ జిల్లా అధ్యక్షులు ఓర్స్ తిరుపతి, నియోజకవర్గ నాయకులు, ముదిరాజ్ కుల సంఘం కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply