10 Kendra | దేశవ్యాప్త సమ్మె విజయవంతం చేయాలి…

10 Kendra | దేశవ్యాప్త సమ్మె విజయవంతం చేయాలి…
- మండల కేంద్రాల్లో ఆందోళనలు నిర్వహించాలి.
- ప్రజా సంఘాల నాయకులు నేతవత్ రాందాస్
10 Kendra | ఉట్నూర్, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక సంస్కరణలు, ప్రజావ్యతిరేక ఆర్థిక విధానాల కారణంగా కార్మికులకు రక్షణ లేకుండా పోయిందని నిరసిస్తూ 10 కేంద్ర కార్మిక సంఘాల సంయుక్త వేదిక, రైతు సంఘాల మద్దతుతో ఈ నెల 12 గురువారం దేశవ్యాప్త సమ్మె (భారత్ బంద్)కు విజయవంతం చేయాలని ప్రజాసంఘాల ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా జేఏసీ అధ్యక్షులు నేతావత్ రాందాస్ కోరారు.
బుధవారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ లో నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ బంద్‌కు ప్రజా సంఘాల జేఏసీ సంపూర్ణ సంఘీభావం ప్రకటిస్తుందని ఆయన అన్నారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా మండలాలలో జిల్లా కేంద్రాలలో ఈ సమ్మెను విజయవంతం చేయాలని పిలుపు ఇస్తున్నామని అన్నారు.కార్మికులు, రైతులు, ప్రజాసంఘాలతో సమన్వయం చేసుకొని శాంతియుతంగా కార్యక్రమాలు చేపట్టాలని ప్లకార్డులతో ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఖండించాలని,ప్రజల హక్కుల పరిరక్షణ కోసం ఈ ఉద్యమాన్ని విజయవంతం చేద్దమని ఆయన అన్నారు. ఈ సమావేశంలో ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.
