10 Dead Bus Lorry Crash : 10 మంది అక్క‌డిక్క‌డే బుగ్గి Andhra Prabha Latest News

10 Dead Bus Lorry Crash : 10 మంది అక్క‌డిక్క‌డే బుగ్గి Andhra Prabha Latest News

  • రాయ‌వ‌రంలో ఘోరం
  • ట్రిప్ప‌ర్‌.. ప్రైవేటు బ‌స్సు ఢీ
  • మ‌రో 20 మందికి గాయాలు
  • మార్కాపురం ఆసుప‌త్రికి త‌ర‌లింపు

( ఆంధ్ర‌ప్ర‌భ‌, మార్కాపురం ప్ర‌తినిధి)

10 Dead Bus Lorry Crash : మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో (మార్చి 26, 2026) గురువారం తెల్లవారుజామున జ‌రిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప‌ప‌10 మంది స‌జీవ‌ద‌హ‌నం అయ్యారు. ప్రాథ‌మిక స‌మాచారం మేర‌కు, హైదరాబాద్ నుండి ప్రకాశం జిల్లా పొదిలి వైపు వెళ్తున్న హరికృష్ణ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, రాయవరం వద్ద పలకల క్వారీల సమీపంలో ఎదురుగా వస్తున్న కంకర లారీని అత్యంత వేగంతో ఢీకొట్టింది.

10 Dead Bus Lorry Crash 10 మంది సజీవ దహనం

బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో 10 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. దాదాపు 20 మందికి గా తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం తక్షణమే మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద స్థ‌లికి వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారు. మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ప్ర‌మాద స్థలాన్ని పరిశీలించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఢీకొన్న ధాటికి బస్సు డీజిల్ ట్యాంక్ పగిలి మంటలు వేగంగా వ్యాపించాయని, ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉండటంతో ప్రాణనష్టం ఎక్కువగా జరిగిందని ప్రాథమిక సమాచారం. ప్ర‌స్తుతం పోలీసులు మృతదేహాలను గుర్తించే ప్రక్రియను చేపట్టారు ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

10 Dead Bus Lorry Crash మంత్రులు దిగ్బ్రాంతి

మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ , మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దిగ్గ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో పలువురు సజీవ దహనం కావడం పై మంత్రులు తీవ్ర ఆవేదనకు వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పలకల క్వారీల వద్ద టిప్పర్ ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకోవడం అత్యంత దురదృష్టకరం ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని జిల్లా అధికారులకు మంత్రులు ఆదేశించారు. ఘటనాస్థలిలో బాధితులకు సహాయ చర్యలు ముమ్మరం చేయాలని మంత్రులు సూచించారు. క్షతగాత్రులకు ఉన్నత వైద్యం అందించాలని, వైద్య నిపుణులను పంపించాలని అధికారులకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆదేశించారు.

Leave a Reply