1.50 lakh | యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే వేగవంతం…

1.50 lakh | యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే వేగవంతం…
- ఈ-కేవైసీ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలి…
- నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు : జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి…
1.50 lakh | కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లాలో యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, ఈ-కేవైసీ ప్రక్రియలను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి జిల్లాలోని ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన కలెక్టర్, పెండింగ్ పనులపై సమీక్షించారు. షోకాజ్ నోటీసులు జారీ చేయాలి యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ప్రక్రియను ఇప్పటివరకు ప్రారంభించని 350 మంది స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే పనుల్లో పురోగతి లేని సిబ్బందిపై కూడా నోటీసులు ఇవ్వాలని స్పష్టం చేశారు.
కొన్ని మండలాల్లో అధిక పెండింగ్ ఆదోని, తుగ్గలి, పత్తికొండ, ఆలూరు తదితర మండలాల్లో యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేకు సంబంధించి పెండింగ్ శాతం అధికంగా ఉన్నట్టు గుర్తించిన కలెక్టర్, సంబంధిత ఎంపీడీవోల నుంచి వివరణ కోరారు. మున్సిపాలిటీల్లో కూడా పెండింగ్ కేసులు ఎక్కువగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ-కేవైసీపై ప్రత్యేక దృష్టి జిల్లాలో హౌస్‌హోల్డ్ ఈ-కేవైసీకి సంబంధించి సుమారు 1.50 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని కలెక్టర్ వెల్లడించారు.

ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ‘పి-4’ యాప్‌లో నమోదు ‘పి-4’ కార్యక్రమానికి సంబంధించి బంగారు కుటుంబాలను పరిశీలించి వివరాలను పి-4 యాప్‌లో నమోదు చేయాలని ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లకు సూచించారు. కంట్రోల్ రూమ్ ద్వారా ఈ ప్రక్రియలను నిరంతరం పర్యవేక్షిస్తూ వేగంగా పూర్తి చేసేలా చూడాలని డిప్యూటీ సీఈవోను ఆదేశించారు.
ఈ టెలికాన్ఫరెన్స్‌లో జడ్పీ డిప్యూటీ సీఈవో, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. మొత్తానికి, జిల్లాలో సంక్షేమ పథకాల సమర్థ అమలుకు యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, ఈ-కేవైసీ ప్రక్రియలు కీలకమని పేర్కొంటూ, అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ డా. ఏ. సిరి సూచించారు.
click here to read more : Examinations | మ్యాన్యువల్ విధానానికి స్వస్తి…
