పాతకక్షలే కారణమా?

పాతకక్షలే కారణమా?

సూర్యాపేట,రూరల్ ఆంధ్రప్రభ : జిల్లా కేంద్రంలో వ్యక్తి దారుణ హత్య కు గురైన ఘటన కలకలం సృష్టించింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం స్థానిక రాజీవ్ నగర్ కు చెందిన సారగండ్ల శివ(28) ను పట్టణానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కుసుమవారి గూడెం వైన్స్ ఎదురుగా షాపులో కత్తులు, గొడ్డళ్లతో దారుణంగా నరికి చంపారు. శివతో గతంలో పాత కక్షలు ఉన్న మధు, శ్రీరామ్, సతీష్ లే చంపారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. మృతునికి భార్య అఖిల, కూతురు విజయశ్రీ, కొడుకు రిషి ఉన్నారు. ఘటన స్థలాన్ని డిఎస్పీ ప్రసన్న కుమార్, సీఐ రాజశేఖర్, ఎస్సై బాలు నాయక్ లు పరిశీలించి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం స్థానిక జనరల్ ఆసుపత్రి కి తరలించారు.

Leave a Reply