Zilla Parishad | మండల ప్రత్యేక అధికారిగా….

Zilla Parishad | మండల ప్రత్యేక అధికారిగా….
Zilla Parishad | ములుగు జిల్లా, మంగపేట, ఆంధ్రప్రభ : ములుగు జిల్లా మంగపేట మండల ప్రత్యేక అధికారిగా ములుగు జిల్లా పంచాయతీ అధికారి కొండ వెంకయ్య నియమితులయ్యారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ములుగు జిల్లా పరిషత్ కార్యాలయ సిఈఓ ఎం.సంపత్ రావు జిల్లాలోని అన్ని మండలాలకు ఇటీవల మండల ప్రత్యేక అధికారులను నియమించారు. అందులో భాగంగా ములుగు జిల్లా పంచాయతీ అధికారిగా విధులు నిర్వహిస్తున్న కొండ వెంకయ్యను మంగపేట మండల ప్రత్యేక అధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
సుమారు నెల రోజుల నుండి మేడారం మహా జాతరకు సంబందించిన పారిశుధ్య పనులను ప్రత్యేకంగా పరిశీలిస్తున్న కొండ వెంకయ్య మంగపేట మండల ప్రత్యేక అధికారిగా త్వరలో భాద్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం. కాగా మంగపేట మండలంపై, మండల పరిస్థితులపై పూర్తి స్థాయి అవగాహన ఉన్న కొండ వెంకయ్యను మంగపేట మండల ప్రత్యేక అధికారిగా నియమించడంతో మండల ప్రజలు, పలు పార్టీల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

