Zero Hour | సాగర్ జలాలు విడుదల చేయాలి.

Zero Hour | సాగర్ జలాలు విడుదల చేయాలి.

  • అసెంబ్లీలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు

Zero Hour | ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : నాగార్జునసాగర్ ప్రాజెక్టు మూడో జోన్ పరిధిలోని ఆయకట్టుకు తక్షణమే సాగర్ జలాలు విడుదల చేయాలని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో గురువారం జీరో అవర్లో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు మాట్లాడుతూ సాగునీరు లేక మైలవరం నియోజవర్గ రైతులు పడుతున్న అవస్థలను అసెంబ్లీలో ప్రస్తావించారు. సాగునీటి సమస్యలను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు దృష్టికి తీసుకెళ్లారు.

ఎన్.ఎస్.పి మూడవ జోన్ కు 14 టీ.ఎం.సీల నీరు కేటాయించగా ఇప్పటివరకు కేవలం 1.6 టీ.ఎం.సీల నీరు మాత్రమే విడుదల చేశారన్నారు. మూడవ జోన్ పరిధిలో సాగుచేస్తున్న మొక్కజొన్న, తదితర ఆరుతడి పంటలకు నీరు అత్యవసరం అన్నారు. సాగునీటి విడుదల కోసం కిందిస్థాయి అధికారులు తెలంగాణా అధికారులతో మాట్లాడితే స్పందించడం లేదన్నారు.

వారికి అవసరం లేనప్పుడు మాత్రమే నీటిని దిగువకు విడుదల చేస్తామని చెబుతున్నారని, మన రాష్ట్రానికి అవసరం అయినప్పుడు సాగునీటిని విడుదల చేయడం లేదన్నారు. ఈ యేడాది సమృద్ధిగా వర్షాలు కురిసి, రిజర్వాయర్లు అన్నింటిలో నీళ్లు ఉండి కూడా సకాలంలో సాగునీటిని సరఫరా చేయకపోతే అది మన వైఫల్యమేనన్నారు. రైతులు వేసిన పంటలు కాపాడుకోవాలంటే వరుసగా 10 రోజుల పాటు నిరంతరాయంగా నీళ్లు ఎన్.ఎస్.పి మూడవ జోన్ కు విడుదల చేయాలని అన్నారు. ఈ విషయంలో మంత్రి నిమ్మల రామానాయుడు, తెలంగాణ మంత్రి తో పాటు, ఉన్నతాధికారులతో మాట్లాడి సాగునీటిని విడుదల చేయించాలని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు కోరారు.

Leave a Reply