ఇచ్చాపురం ఆంధ్రా బాప్టిస్ట్ చర్చిలో వైఎస్ సోదరి ప్రార్థనలు
(ఇచ్ఛాపురం, ఆంధ్రప్రభ ): ఆంధ్రా బాప్టిస్ట్ చర్చిలో వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరి వైఎస్ విమలారెడ్డి (YS Vimalareddy) ప్రార్థనలు చేశారు. ఆంధ్రా బాప్టిస్ట్ చర్చి (Andhra Baptist Church) అధ్యక్షులు ప్రత్తి విజయ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్త్రీల ఉజ్జీవ సభల్లో ఆమె పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ మైనార్టీ సెల్ నాయకులు ప్రత్తి అన్వేష్ తదితరులు పాల్గొన్నారు.

