జంతర్ మంతర్ దగ్గర…

యువకుడు తనను తాను కాల్చుకుని..


ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ (Jantar Mantar) వద్ద భయానక ఘటన జరిగింది. ఇక్కడ ఓ యువకుడు తన వద్ద ఉన్న దేశీయ తుపాకీతో తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈరోజు ఈ దారుణ సంఘటన జరిగింది. మధ్యప్రదేశ్ నుంచి వచ్చినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఆయన జంతర్ మంతర్‌లో ఏదో ఆందోళన చేయాలని వచ్చి, మెటల్ డిటెక్టర్ గేట్ల దగ్గర టీ స్టాల్ వద్దే ఈ చర్యకు దిగాడు. ఆందోళన ప్రారంభం కాకముందే ఈ ఘటన జరిగింది. స్థానికులు, ఆందోళనకారుల నుంచి సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు తక్షణమే ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు.

Leave a Reply