Youngers | బైక్ రేసర్లపై ఫైర్

Youngers | బైక్ రేసర్లపై ఫైర్
- గుణపాఠం చెప్పిన కొల్లగుంట గ్రామస్తులు
Youngers | శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : శ్రీ సత్యసాయి జిల్లా కొల్లగుంటలో బైక్ రేసర్ల తీరుకు గ్రామస్తుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. గ్రామ రహదారిని రేసింగ్ ట్రాక్‌గా మార్చి దూసుకుపోతున్న యువకులపై భగ్గుమన్నారు. శనివారం గ్రామంలో అతివేగంగా బైకులు నడపడంతో గ్రామస్థులు వారిని అడ్డుకుని హెచ్చరించారు. ఆ సమయంలో గ్రామస్థులపై బైక్ రేసర్లు దురుసుగా ప్రవర్తిస్తూ దాడికి దిగారు. దీంతో గ్రామ ప్రజల ఆగ్రహం హద్దులు దాటింది.
అందరూ ఏకమై రేసర్లపై మూకుమ్మడిగా విరుచుకుపడి గుణపాఠం చెప్పారు. రేసర్లు తప్పించుకునేందుకు ప్రయత్నించినా వదిలిపెట్టలేదు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని ఆ యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఆరుగురిపై కేసులు నమోదు చేశారు. గ్రామాల్లో ఇలాంటి ప్రమాదకర రేసింగ్‌లను సహించేది లేదని గ్రామస్థులు స్పష్టం చేయగా, పోలీసులు కూడా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
