ఆంధ్ర–ఒడిశా సరిహద్దులోని బలరాంపురం పాత చెక్‌పోస్ట్ సమీపంలో దుర్ఘటన చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం ప్రకారం, ఒక యువకుడు రహదారి దాటుతున్న సమయంలో, వేగంగా దూసుకువచ్చిన లారీ అతనిని ఢీకొట్టింది. ఢీకొన్న తీవ్రతకు యువకుడు లారీ టైర్ల కింద పడి, అక్కడికక్కడే మృతిచెందాడు.

ఘటన చూసిన ప్రయాణికులు, స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఇచ్ఛాపురం పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని, దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply