18వ వార్డులో కారు జోరు

18వ వార్డులో కారు జోరు
- ప్రచారంలో దూసుకుపోతున్న అభ్యర్థి మహమ్మద్ జబ్బార్
- ప్రచారంలో అడుగడుగునా ప్రజల నుంచి అపూర్వ స్పందన
- బీఆర్‌ఎస్ గెలుపు ఖాయమంటున్న ప్రజానీకం
స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ : 18వ వార్డు నుంచి బీఆర్‌ఎస్ తరఫున కౌన్సిలర్‌గా పోటీ చేస్తున్న యువ నాయకుడు మహమ్మద్ జబ్బార్ ప్రచారంలో దూసుకుపోతు న్నారు. యువత కావడంతో ఉత్సాహం, డైనమిజంతో ముందుకు సాగు తున్న ఆయనకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. మంచి మన సున్న వ్యక్తిగా ఎవరికి ఏ అవసరం వచ్చినా ముందుండి సహాయం చేసే గుణం కలవాడిగా జబ్బార్‌కు వార్డులో ప్రత్యేక గుర్తింపు ఉంది. రాజ కీయ లాభాల కోసం కాదు…సమాజానికి ఏదైనా చేయాలి..ప్రజల సేవే లక్ష్యంగా పనిచేయాలి అన్న ఆలోచనతోనే ఆయన ప్రజల ముందుకు వచ్చారు. శుక్రవారం పార్టీ నాయకులు వార్డు ప్రజలతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్బంగా ప్రజల సమస్యలను శ్రద్ధగా వింటూ ప్రతి గల్లీ ప్రతి కాలనీ సమస్య తనదేనన్నట్టుగా స్పందిస్తున్నా రు. ఓటర్లను కలిసి, మీ అమూల్యమైన ఓటు కారు గుర్తుపై వేసి, తన ను కౌన్సిలర్ గా గెలిపించాలని అభ్యర్థించారు. యువతతో పాటు పెద్దలు, మహిళలు కూడా ఆయనపై నమ్మకం ఉంచుతూ ఆశీర్వాదం అందిస్తున్నారు. యువతకు అవకాశం ఇస్తే మార్పు తప్పకుండా వస్తుం దన్న నమ్మకంతో మహమ్మద్ జబ్బార్ ముందుకు సాగుతున్నారు. 18వ వార్డులో బీఆర్‌ఎస్ గెలుపు ఖాయం అని స్థానికులు అంటున్నారు. ఈ కార్యక్రమంలో మునిగేల రాజు, మునిగేల మహేష్, నక్క ప్రవీణ్, హరి సింగ్, మహమ్మద్, రియాజ్, మహమ్మద్ అజీజ్, మహమ్మద్ సలీం, ఊరడి అఖిల్, తోట మహేష్, హస్తము, ప్రభు కిరణ్, మోటం రాజు, రాయ పురం సంతోష్, గూటం సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
