Yerpudu | ఆధ్యాత్మిక వైభవంగా రథసప్తమి వేడుకలు..

Yerpudu | ఆధ్యాత్మిక వైభవంగా రథసప్తమి వేడుకలు..
Yerpudu | ఏర్పేడు, ఆంధ్రప్రభ : మండలంలోని వికృతి మాల శ్రీ సంతాన సంపద శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో రథసప్తమి సందర్భంగా ఆధ్యాత్మిక శోభ ఉట్టి పడింది. ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ పి ఏ సి సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని కుటుంబ సభ్యులతో కలిసి వికృతమాల గ్రామంలోని శ్రీ సంతాన సంపద వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వైభవంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రథసప్తమి మహోత్సవ వేడుకల్లో భాగంగా శ్రీ సంతాన సంపద వెంకటేశ్వర స్వామి వారు సూర్య ప్రభ వాహనంపై భక్తులకు దివ్య దర్శనం కలిగించారు.
వేద మంత్రోచ్ఛారణల మధ్య అర్చనలు, అభిషేకాలు, హారతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఆలయ ప్రాంగణం అంతా గోవింద నామస్మరణలతో మారుమోగిపోయింది. ఈ సందర్భంగా డా. పసుపులేటి హరిప్రసాద్ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, గ్రామ ప్రజల సుఖశాంతులు, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ప్రార్థించారు. స్వామి వారి దర్శనార్థం వికృతమాల గ్రామంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ డా. పసుపులేటి హరిప్రసాద్, వెంకటేశ్వర ప్రసాద్ ,శివ ప్రసాద్ కుటుంబ సమేతంగా పాల్గొని స్వామి వారికి పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, పుర ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా బత్తిన మధుబాబు భక్తులందరికీ స్వయంగా ప్రసాదాలు అందజేసి, భక్తుల సేవలో పాల్గొన్నారు. భక్తులకు ప్రసాద పంపిణీ సవ్యంగా జరిగేలా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు.
