YCP party | నుంచి అంబటిని సస్పెండ్ చేయ్…

YCP party | నుంచి అంబటిని సస్పెండ్ చేయ్…

  • మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి…

YCP party | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : అధికారం, ఆదాయం పోయిందనీ వైసీపీ నాయకులకు ఆక్రోషం పెరిగి ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై సభ్య సమాజం ఛిగ్గుపడేలా బూతులు తిట్టిన వైసీపీ నాయకులు, మాజీ మంత్రి అంబటి రాంబాబును జగన్ వెంటనే వైసీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనీ టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి డిమాండ్ చేశారు.ఆదివారం నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం శ్రీకొలను భారతీదేవీ అమ్మవారిని దర్శనం చేసుకొన్నారు.

ఈ సందర్బంగా బైరెడ్డి రాజశేఖరరెడ్డి మాట్లాడుతూ సీఎం చంద్రబాబుపై తీవ్ర పదజాలంతో దూషించిన అంబటి వెంటనే క్షమాపణ చెప్పాలనీ లేకుంటే టీడీపీ కార్యకర్తలు నీ నాలుక కోస్తారు జాగ్రత్త అంటూ అంబటీ రాంబాబును హెచ్చరించారు. కల్లుతాగిన కోతిలా ఎలా పడితే ఆలా మాట్లాడుతావా అంబటి, నాటుసారా తాగావా, గంజాయి మత్తులో ఉన్నావా, డ్రగ్స్ తీసుకొని మాట్లాడావా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అంబటి, చదువుకున్నావ్, బాధ్యత గల పదవులు అనుభవించావ్, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబును భూతులతో తిట్టడం కనీసం ఛిగ్గు ఉండాలి కదా.

ఇలాంటి వాళ్లు నీ వైసీపీలో ఉంటే నీకు చెడ్డపేరు, నీ పార్టీ మునుగుతుంది జగన్ వెంటనే అంబటిని మీ పార్టీ నుంచి సస్పెండ్ చేసి నీ నిజాయితీ నిరూపించుకో అని బైరెడ్డి మాజీ సీఎం జగన్ కు సలహా ఇచ్చారు. నీ అదృష్టం బాగుండి ఒక సారి ముఖ్యమంత్రి అయ్యావు, నీ అనేక తప్పుల వల్ల పడిపోయావ్, నీ చుట్టూ అంబటి లాంటి వారు ఉంటే నీ వైసీపీయే మునిగిపోతుందన్నారు . అంబటి తో పాటు జగన్ కూడా సీఎం చంద్రబాబుకు భేషరత్ గా క్షమాపణ చెప్పాలని లేకుంటే టీడీపీ నాయకులు, కార్యకర్తలు తగిన రీతిలో బుద్ధి చెబుతారని బైరెడ్డి హెచ్చరించారు. కార్యక్రమంలో పలువులు టిడిపి నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply