వైసీపీకి ఒక్కచాన్స్‌తో.. ఏపీకి న‌ష్టం..

వైసీపీకి ఒక్కచాన్స్‌తో.. ఏపీకి న‌ష్టం..

  • బీహార్‌కు ఆ ప‌రిస్థ‌తి వ‌ద్దు
  • రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేష్

పాట్నా(బీహార్), ఆంధ్ర‌ప్ర‌భ‌ : వికసిత్ భారత్ లక్ష్యసాధనలో బీహార్ పాత్ర చాలా కీలకమైంది. బీహార్ సర్వతో ముఖాభివృద్ధికి మరోమారు బీహార్ యువత ఎన్ డీఏ(Bihar Youth NDA)ను గెలిపించాల్సిందిగా రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్(Nara Lokesh) విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పాట్నా వెళ్లిన లోకేష్… అక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… నేను ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ఇక్కడకు రాలేదు. బాధ్యతాయుతమైన భారతీయుడిగా ఇక్కడకు వచ్చాను. బీహార్ లో జరగబోయే ఈ ఎన్నిక భారత రాజకీయాల్లో ఎంతో కీలకమైనది. బీహార్ యువత మరోమారు ఎన్ డీఏని ఎందుకు గెలిపించాల‌ని చెప్పడానికే ఇక్కడకు వచ్చాను. మూడు కారణాలతో ఇక్కడ ప్రజలు ఎన్ డీఏని గెలిపించాలి. ఆంధ్రప్రదేశ్ లో 2019లో ఒక్కచాన్స్(Okchans) పేరుతో వైసీపీ ప్రభుత్వానికి అవకాశం ఇవ్వడం వల్ల శాంతిభద్రతలు క్షీణించి పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోయాయి. దానివల్ల మా రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. అటువంటి పరిస్థితులు బీహార్ లో తెచ్చుకోవద్దని బీహార్ యువతకు విజ్ఞప్తి చేస్తున్నా. బీహార్ లో మూడు కారణాల వల్ల ఎన్ డీఏ ని గెలిపించాల్సిన అవసరం ఉంది.

  1. లీడర్ షిప్ ట్రాక్ రికార్డు – స్వచ్ఛమైన, అవినీతిరహిత పాలన కోసం ఎన్ డీఏని గెలిపించాలి. గౌరవ ప్రధానమంత్రి నరేంద్రమోదీ బీహార్ రూపురేఖలు మార్చేశారు. బీహార్ లో నాని (నరేంద్ర మోడీ జీ, నితీష్ కుమార్ జీ) నాయకత్వం ఉంది. బీహార్ ఆర్థిక వ్యవస్థను ట్రిలియన్ డాలర్లకు చేర్చడమే ఆయన లక్ష్యం.
  2. డబుల్ ఇంజన్ సర్కారు – బీహార్, ఆంధ్రప్రదేశ్ లో ఎన్ డీఏ భాగస్వామ్య ప్రభుత్వాలు ఉండటం వల్ల కేంద్రబడ్జెట్(Central Budget)లో భారీగా నిధులు లభిస్తున్నాయి. మౌలిక సదుపాయాలు, విద్యాసంస్థలకు కేంద్రం సహకరిస్తోంది. అంతేగాక కేంద్రం తీసుకునే విధానపరమైన నిర్ణయాల్లో రాష్ట్రాల్లో ఎన్ డీఏ భాగస్వామ్య పక్షాల భాగస్వామ్యం ఉంటుంది. వివిధ పరిశ్రమలు రావడానికి కేంద్రం మద్దతు లభిస్తుంది.
  3. ప్రభుత్వాల కొనసాగింపు చాలా ముఖ్యం. గుజరాత్, ఒడిశా(Gujarat, Odisha) రాష్ట్రాలు ప్రభుత్వాల కొనసాగింపు వల్ల పెద్దఎత్తున అభివృద్ధి సాధించాయి. బీహార్ లో జంగిల్ రాజ్ పాలన పోయి నితీష్ కుమార్ ప్రభుత్వం వచ్చాక శాంతిభద్రతలు బాగుండటంతో పాట్నా ఎంతో అభివృద్ధి సాధించిందని బీహార్ ఇండస్ట్రీ అసోసియేషన్ నాయకులు చెప్పారు.

బీహార్ లో ఒక పార్టీ ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెబుతోంది. ఆచరణ సాధ్యం కాని హామీలను బీహార్ యువత నమ్మవద్దు. ఎన్ డీఏ భాగస్వామిగా చెబుతున్నాం. రాష్ట్రాలు బలంగా ఉంటేనే భారతజాతి బలోపేతమవుతుంది. ప్రధాని మోదీజీ(Prime Minister Modiji) బీహార్ రూపురేఖలు మార్చేశారు. డబుల్ ఇంజన్ సర్కారు కారణంగానో బీహార్, ఏపీలకు కేంద్రంనుంచి పెద్దఎత్తున నిధులు లభిస్తున్నాయని మంత్రి లోకేష్ చెప్పారు. విలేకరుల సమావేశంలో బీహార్ స్టేట్ మీడియా విభాగం హెడ్, ఎమ్మెల్సీ సంజయ్ మయూక్, పార్లమెంటు సభ్యులు సానా సతీష్, గంటి హరీష్, మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు పాల్గొన్నారు.

Leave a Reply