ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : యూరియా (Urea) కొరత, రైతాంగ సమస్యలపై వైసీపీ (YCP) పోరుకు సిద్ధమైంది. ఈనెల 9వ తేదీన వైసీపీ ‘అన్నదాత పోరు’ (Annadata Poru) పేరుతో కార్యక్రమాలు నిర్వహించనుంది. ఆర్డీవో కార్యాలయాల (RDO offices) ఎదుట వైసీపీ శాంతియుత నిరసనలు తెలపనుంది. ‘అన్నదాత పోరు’ పోస్టర్‌ని పార్టీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy)విడుదల చేశారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. ఈ నెల తొమ్మిదవ తేదీన రైతుల సమస్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు పోరు కార్యక్రమం నిర్వహించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, నందిగం సురేష్, వెల్లంపల్లి శ్రీనివాస్, టీజేఆర్ సుధాకర్ బాబు, రాయన భాగ్యలక్ష్మి, మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.