హిందూపురంలో వైసీపీ దూకుడు
హిందూపురం, ఆంధ్రప్రభ : వైసీపీ ప్రభుత్వం తలపెట్టిన కోటి సంతకాల సేకరణ హిందూపురంలో నిర్విరామంగా కొనసాగుతుంది. ఏడవ వార్డులో కోటి సంతకాల సేకరణ ఇంచార్జ్ అయుబ్ బేగ్(Ayub Beg) ఆధ్వర్యంలో దీపికా వేణు రెడ్డి ఆదేశాల మేరకు సంతకాల సేకరణ జరుగుతుంది. ఈ సందర్భంగా అయూబ్ బేగ్ మాట్లాడుతూ మెడికల్ కళాశాలన్నీ ప్రైవేటీకరణ చేస్తున్న చంద్రబాబు(Chandrababu) కూటమి ప్రభుత్వ పాలనపై విసిగి వేసారి ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంతకాలు చేస్తున్నారని ఆయన తెలిపారు.
ప్రతి పేద విద్యార్థి కూడా డాక్టర్ కావాలన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి(Jaganmohan Reddy) మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేస్తే కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడంపై చాలా దారుణం అన్నారు. వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని కూటమి ప్రభుత్వానికి ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

