YCP | జ‌గ‌న్ జన్మదిన‌ వేడుకలు

YCP | జ‌గ‌న్ జన్మదిన‌ వేడుకలు

  • అవనిగడ్డ పార్టీ కార్యాలయంలో కేక్ కటింగ్

YCP | అవనిగడ్డ, ఆంధ్రప్రభ : వైసీపీ అధ్య‌క్షుడు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుక‌ల‌ను అవనిగడ్డ పార్టీ కార్యాలయంలో ఘ‌నంగా నిర్వ‌హించారు. మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు కేక్ కటింగ్ చేశారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి బ్రెడ్, పండ్లు పంచి రోగులను పరామర్శించారు.

ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. జగన్‌ పుట్టినరోజు వేడుక‌ల‌ను ఈరోజు రాష్ట్రమంతా ఘనంగా నిర్వహిస్తున్నారన్నారు. ప్రజలు తాము చేసిన తప్పు వలన ఎంతగానో నష్టపోయామని గుర్తించార‌ని, మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, వార్డ్ మెంబర్లు, అభిమానులు పాల్గొన్నారు.

Leave a Reply