Yashoda | దవాఖానలో కూడా తెలంగాణ ధ్యాసే.. పార్టీ నేత‌ల‌తో కెసిఆర్ ముచ్చ‌ట్లు

హైద‌రాబాద్ – తను ఎక్కడున్నా , ఏ పరిస్థితి లో ఉన్నా, తన ధ్యాసంతా తెలంగాణ (telangana ) ప్రజా సంక్షేమం చుట్టే కేంద్రీకృతమై ఉంటుందని మాజీ ముఖ్యమంత్రి, (ex cm ) బిఆర్ఎస్ (brs ) కేసీఆర్ (Kcr ) మరోసారి రుజువుచేశారు. సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం గురువారం యశోద దవాఖానలో (yashoda hospital ) చికిత్స పొందుతున్న ఆయ‌న‌ను ప‌రామ‌ర్శించేందుకు ప‌లువురు నేత‌లు అక్క‌డికి వ‌చ్చారు.

ఈ సందర్భంగా వారితో అధినేత ఇష్టాగోష్టి గా మాట్లాడారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులు, వ్యవసాయం, సాగునీరు, రైతు సమస్యలు, యూరియా ఎరువుల లభ్యత సహా తదితర ప్రజా సమస్యలు, వర్తమాన అంశాలపై వారితో సుదీర్ఘంగా చర్చించారు. పార్టీ నేతలతో జరిగిన చర్చ సందర్భంగా కేసీఆర్ గారు ఉత్సాహంగా మాట్లాడుతూ ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు.

Leave a Reply