మోగిన ప్రమాద ఘంటికలు
సురక్షిత ప్రాంతాలకు జనం
( ఆంధ్రప్రభ, ఢిల్లీ) యమునా నది వరద పోటెత్తింది. ప్రమాద స్థాయి దాటింది. ఈ నది పరివాహిక ప్రాంతాల్లోని జనం వరద భయంతో వణిపోతున్నారు. జనం తల్లడిల్లిపోతున్నారు. లోహ పూల్ ప్రాంతంలో వరద తీవ్రస్థాయికి చేరింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించటంలో సహాయక బృందాలు బిజీబిజీగా ఉన్నాయి.

