Yagneshwar Reddy | గాంధీ పేరు తొలగించడం స‌రికాదు

Yagneshwar Reddy | గాంధీ పేరు తొలగించడం స‌రికాదు

Yagneshwar Reddy | ఊట్కూర్, ఆంధ్రప్రభ : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో గాంధీ పేరును తొలగించడం సరికాదని కాంగ్రెస్ పార్టీ నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల అధ్యక్షుడు డి.యగ్నేశ్వర్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో ఖండించారు. ఉపాధి ప‌థ‌కాన్ని నిర్వీర్యం చేస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాలపై ఆర్థిక భారాన్ని మోపుతుంద‌ని పేర్కొన్నారు. స్వాతంత్ర్యోద్యమంలో కీలక భూమిక పోషించిన గాంధీజీ పేరును ఉపాధి హామీ పథకం నుంచి తొలగించడం మోడీ ప్రభుత్వం నిరంకుశత్వానికి నిదర్శనమని, వెంటనే గాంధీజీ పేరు తిరిగి జోడించాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ పథకం గాంధీజీ పేరు పై ప్రారంభించగా.. బిజెపి ప్రభుత్వం తొలగించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం పునరాలోచించి గాంధీజీ పేరు చేర్చాలన్నారు. ఉపాధి హామీ చట్టంలోని మార్పులను వెనక్కి తీసుకోవాల‌న్నారు.

Leave a Reply