Yadagirigutta | ఘనంగా లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం

Yadagirigutta | ఘనంగా లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం
- పాల్గొన్న ఎమ్మెల్సీ కూచుకళ దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి దంపతులు
Yadagirigutta | నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని శ్రీ సీతారామస్వామి ఆలయంలో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో స్వామివారి కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, ఎంఎల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, డీఎస్పీ శ్రీనివాస్, మార్కెట్ ఛైర్మన్ రమణ రావు, కార్యనిర్వహణాధికారి రఘు పూజల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా యాదాద్రి ఆలయ అర్చకులు కళ్యాణోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించారు. భజన మండలి, మహిళల కోలాటాలతో కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ… లక్ష్మీనరసింహ స్వామివారి కళ్యాణం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో జరపడం ఎంతో సంతోషకరమన్నారు. భక్తి భావం ప్రజల్లో మానవత్వాన్ని పెంపొందిస్తుందన్నారు. యాదాద్రి గుడి నిర్వాహకులను అభినందించారు.

