Yadadri | పోలింగ్ కేంద్రాల్లో కలెక్టర్..

Yadadri | పోలింగ్ కేంద్రాల్లో కలెక్టర్..

Yadadri, ఆంధ్రప్రభ : స్థానిక సంస్థల మొదటి దశ పోలింగ్ కేంద్రాలను గురువారం అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సందర్శించారు. జిల్లాలోని యాదగిరిగుట్ట, సైదాపురం మోడల్ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఓటర్లతో మాట్లాడుతూ.. శాంతియుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. కేంద్రాల వద్ద మౌళిక వసతులను పరిశీలించారు. వంద మీటర్ల దూరంలో గుంపులుగా ఉండవద్దని, 144 సెక్షన్ అమలులో ఉందని, ఓటర్లు, ప్రజా ప్రతినిధులు, ఆయా రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని కోరారు.

Leave a Reply