WTC Final | విజయం దిశగా దూసుకుపోతున్న దక్షిణాఫ్రికా !

ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌ మూడో రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా విజయం దిశగా దూసుకెళ్తోంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌గా నిలిచేందుకు దక్షిణాఫ్రికా ఇంకా 69 పరుగులు అవసరం. మ్యాచ్‌లో ఐడెన్ మార్క్రామ్ (102), టెంబా బావుమా (65) కీల‌క పార్ట్ న‌ర్ షిప్ తో జట్టును విజయానికి ఒక అడుగు దూరంలో నిలిపారు.

మూడో రోజు మార్క్రామ్ – బవూమా మెరుపులు

ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ రెండుసార్లు దెబ్బ కొట్టి దక్షిణాఫ్రికాను కొద్దిగా ఒత్తిడిలోకి నెట్టాడు. రికెల్టన్ (6) ను తొలిగా అవుట్ చేయగా, అనంతరం వియన్ ముల్డర్ (27) ను కూడా పెవిలియన్ చేర్చాడు. అయితే, ఆ తర్వాత సాఫీగా కుదురుకున్న దక్షిణాఫ్రికా బ్యాటింగ్… మ్యాచ్‌ను తనవైపు తిప్పుకుంది. మూడో వికెట్‌కు 143 పరుగుల అజేయ భాగస్వామ్యం నమోదు చేసిన మార్క్రామ్ – బవూమా జోడీ, ఆస్ట్రేలియా బౌలర్లపై జోరుగా ఆడింది.

ఆస్ట్రేలియా బ్యాటింగ్

అంతకు ముందు, రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా తుది స్కోరు 281 పరుగుల ఆధిక్యాన్ని అందించింది. స్టార్క్‌ అద్భుతంగా ఆడుతూ 58 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఆస్ట్రేలియా టేయిలెండ‌ర్స్ సుదీర్ఘంగా ఆడి, దక్షిణాఫ్రికా బౌలర్లకు ఇబ్బంది కలిగించారు. మూడో రోజు పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారడంతో, ఆ ప్రయత్నం ఫలించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *