వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2023-25 ఫైనల్‌లో తొలి రోజు ఉదయ సెషన్ పూర్తయ్యే సమయానికి దక్షిణాఫ్రికా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సఫారీలు, ఆస్ట్రేలియాను కేవలం 67 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయేలా చేసి మ్యాచ్‌పై పట్టు సాధించారు.
ఉదయం మేఘావృత పరిస్థితులు ఉండటంతో దక్షిణాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది. ప్రారంభంలో కగిసో రబడా, మార్కో జాన్సన్ తమ అత్యద్భుత బౌలింగ్ తో ఆస్ట్రేలియా ఓపెనర్లను ఒత్తిడిలోకి నెట్టేశారు.
ఏడో ఓవర్‌లో ఖవాజా 20 బంతుల్లో డక్‌గా అవుట్ కాగా, అదే ఓవర్‌లో కెమెరూన్ గ్రీన్ నాలుగు పరుగులకే పెవిలియన్ చేరాడు.
టెస్టుల్లో తొలిసారిగా ఓపెనింగ్ చేస్తున్న మార్నస్ లబుషేన్ క్రీజులో కాస్త నిలబడే ప్రయత్నం చేశాడు. అతనికి జతగా వచ్చిన స్టీవ్ స్మిత్ తో కలిసి 30 పరుగుల భాగస్వామ్యం అందించాడు. అయితే జాన్సన్ తన రెండవ స్పెల్‌లో లబుషేన్‌ను 17 పరుగుల వద్ద క్యాచ్ అవుట్ చేశాడు.
ఆ తర్వాత వచ్చిన ట్రావిస్ హెడ్, తన దూకుడుతో 13 బంతుల్లో 11 పరుగులు చేశాడు. కానీ లంచ్‌కు ముందు ఓవర్‌లో మార్కో జాన్సన్ ఓవర్లో ఔటయ్యాడు.
లంచ్ సమయానికి స్కోరు
ఆస్ట్రేలియా – 67/4 (23.2 ఓవర్లు)
స్టీవ్ స్మిత్ – 26 (నాట్ అవుట్)*
దక్షిణాఫ్రికా బౌలర్లలో:
కగిసో రబడా – రెండు వికెట్లు
మార్కో జాన్సన్ – రెండు వికెట్లు