WTC | గిల్ కు లిట్మస్ టెస్ట్.. రేపే ఇంగ్లాండ్ తో టీమిండియా డీ !

ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ టోర్నిలో భాగంగా తొలిమ్యాచ్ శుభమ్ గిల్ నేతృత్వంలో రేపు ఇంగ్లండ్ తో త‌ల‌ప‌డ‌నుంది. లీడ్స్‌ వేదికగా జరిగే తొలి టెస్టుతో ఈ సుదీర్ఘ సిరీస్‌కు తెరలేవనుంది. రేప‌టి నుంచి ప్రారంభం కానున్న ఈ టెస్టు సిరీస్ ఐదు మ్యాచ్‌ల వరుసగా జరగనుండగా, ఈ సిరీస్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025-27 పాయింట్ల పట్టికలో కీలకంగా మారనుంది.

టీమిండియా యువ శక్తి…

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ లు టెస్ట్ ల నుంచి రిటైర్ కావడంతో భారత టెస్ట్ క్రికెట్ లో ఒక అధ్యాయం ముగిసింది. దీంతో ఈసారి స్టార్ త్రయం లేకుండానే టీం ఇండియా ఇంగ్లాండ్ తో తలపడనుంది. భారత జట్టుకు నాయకత్వం వహించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత, బీసీసీఐ అతని స్థానంలో యువ ఆటగాడు శుభ్‌మాన్ గిల్‌ను నియమించింది. దీంతో గిల్ భారత జట్టుకు 37వ టెస్ట్ కెప్టెన్ అయ్యాడు.

ఇప్పుడు బాధ్యతను తీసుకున్న శుభ్మన్ గిల్ కెప్టెన్‌గా తన తొలి పూర్తి సిరీస్‌కు సిద్ధమవుతున్నాడు. జైస్వాల్, సాయి సుధర్శన్, నితీష్ రెడ్డి వంటి యువ ఆటగాళ్లు తమకంటూ స్థానం దక్కించుకునేందుకు తహతహలాడుతున్నారు. బౌలింగ్ విభాగంలో బుమ్రా, సిరాజ్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ వంటి ఆటగాళ్లు ఉన్నారు. ఈ సిరీస్‌ కోసం భారత్‌, ఇంగ్లండ్‌ ప్లేయర్లతో పాటు ఇరుజట్ల అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

గిల్‌పైనే అందరి దృష్టి..!

జట్టులో రవీంద్ర జడేజా తప్ప మిగతా వారిలో ఇంగ్లండ్ పిచ్‌లపై ఆడిన అనుభవం ఎక్కువగా లేదు. అలాంటి వేళ, కొత్త కెప్టెన్‌గా గిల్‌కు అప్పగించిన బాధ్యత చాలా కీలకమైంది. కెప్టెన్‌గా, బ్యాటర్‌గా గిల్‌ ఎలా రాణిస్తాడోనని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

స్వదేశంలో అతడి రికార్డు మెరుగ్గానే ఉన్నా, విదేశాల్లో గిల్‌ ప్రదర్శన మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పటి వరకు విదేశీ టెస్టుల్లో 15 మ్యాచ్‌ల్లో అతడు 27.53 సగటుతో 716 పరుగులు మాత్రమే చేశాడు. ఈ గణాంకాలే ఇప్పుడు అతనిపై ఒత్తిడిని పెంచుతున్నాయి.

భారత జట్టు :
శుభ్మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుధర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ రెడ్డి, జడేజా, ధృవ్ జురేల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, బుమ్రా, సిరాజ్, ప్రసిద్ధ్, ఆకాశ్ దీప్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా.

ఇంగ్లాండ్ జట్టు – బజ్‌బాల్ కొనసాగుతుందా?

బెన్ స్టోక్స్ నేతృత్వంలోని ఇంగ్లాండ్ టెస్ట్ జట్టు తనదైన “బజ్‌బాల్” స్టైల్‌తో మరోసారి దుమ్మురేపేందుకు సిద్ధమైంది. జో రూట్, బెయిర్‌స్టో, బ్రూక్ వంటి బ్యాటింగ్ స్టార్‌లు ఉన్న ఈ జట్టు, బౌలింగ్‌లో సామ్ కుక్, బ్రైడన్ కార్స్, జోష్ టంగ్ వంటి యువ బౌలర్లపై ఆశలు పెట్టుకుంది.

ఇంగ్లాండ్ జట్టు :
బెన్ స్టోక్స్ (కెప్టెన్), జో రూట్, జేమీ స్మిత్ (వికెట్ కీపర్), షోయబ్ బషీర్, జాకబ్ బెతెల్, హారీ బ్రూక్, బ్రైడన్ కార్స్, సామ్ కుక్, జాక్ క్రాలీ, బెన్ డకెట్, జేమీ ఓవర్టన్, ఒల్లి పోప్, జోష్ టంగ్, క్రిస్ వోక్స్

టెస్ట్ షెడ్యూల్ :

1వ టెస్ట్ జూన్ 20–24 లీడ్స్-3:30 PM
2వ టెస్ట్ జూలై 2–6 ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్-3:30 PM
3వ టెస్ట్ జూలై 10–14 లార్డ్స్, లండన్-3:30 PM
4వ టెస్ట్ జూలై 23–27 ఓల్డ్ ట్రాఫర్డ్, మాంచెస్టర్-3:30 PM
5వ టెస్ట్ జూలై 31 – ఆగస్ట్ 4 ఓవల్, లండన్-3:30 PM

ఈ సిరీస్ భారత్ కు కీల‌కంగా మార‌నుంది. రెండుసార్లు డ‌బ్ల్యూటీసీ ఫైనల్‌లో ఓడిపోయిన భారత్.. కొత్త తరం గెలుపుపై దృష్టి పెట్టింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచేందుకు ఈ సిరీస్ టీమిండియాకు కీలకం కానుంది.

Leave a Reply